సీఆర్డీఏ అధికారులకు షాకిస్తున్న బోర్డులు

కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామంటున్న ప్రభుత్వానికి షాక్ తగులుతోంది. ఇప్పటికే కరకట్టమీద ఉన్న పలు భవనాలకు, గెస్ట్‌హౌలకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అయితే వీటిపై ఏపీ హైకోర్టు నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది. మరోవైపు నోటీసులు ఇచ్చేందుకు వెళ్తున్న సీఆర్డీఏ అధికారులకు ఆయా భవనాల మెయిన్ గేటుకు వేలాడుతున్న బోర్డులు షాకిస్తున్నాయి. ఓ గెస్ట్ హౌస్ యజమాని ముందస్తు జాగ్రత్త గానే ఈ హౌస్ కు అన్ని అనుమతులు ఉన్నాయంటూ బోర్డ్ పెట్టుకోవడం […]

సీఆర్డీఏ అధికారులకు షాకిస్తున్న బోర్డులు
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 10:03 PM

కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామంటున్న ప్రభుత్వానికి షాక్ తగులుతోంది. ఇప్పటికే కరకట్టమీద ఉన్న పలు భవనాలకు, గెస్ట్‌హౌలకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అయితే వీటిపై ఏపీ హైకోర్టు నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది. మరోవైపు నోటీసులు ఇచ్చేందుకు వెళ్తున్న సీఆర్డీఏ అధికారులకు ఆయా భవనాల మెయిన్ గేటుకు వేలాడుతున్న బోర్డులు షాకిస్తున్నాయి.

ఓ గెస్ట్ హౌస్ యజమాని ముందస్తు జాగ్రత్త గానే ఈ హౌస్ కు అన్ని అనుమతులు ఉన్నాయంటూ బోర్డ్ పెట్టుకోవడం తో సీఆర్డీఏ అధికారులు వెను తిరిగారు…సర్వే నెంబర్ 32/1 లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ బయట అవర్ బిల్డింగ్ అప్రూవ్డ్ అంటూ సర్వే,ఇంటి నెంబర్ లతో కూడిన బోర్డు ను ఏర్పాటు చేశాడు. శివ రామ కృష్ణ గెస్ట్ హౌస్ పేరుతో ఉన్న ఈ ఇంటి యజమాని 2005 లో హుడా నుంచి పర్మిషన్ తీసుకున్నట్టు చెబుతున్నాడు. నోటీసులు జారీ చేస్తున్న సీఆర్డీఏ అధికారులు వచ్చి వీటిని ఈ బోర్డులను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు.