Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

ఇండియన్-2 షూటింగ్‌లో తెగిపడ్డ క్రేన్.. అసిస్టెంట్ డైరక్టర్‌తో సహా.. ముగ్గురు మృతి

Crane Collapse Accident In Indian 2 Shooting, ఇండియన్-2 షూటింగ్‌లో తెగిపడ్డ క్రేన్.. అసిస్టెంట్ డైరక్టర్‌తో సహా.. ముగ్గురు మృతి

కమల్ హాసన్ హీరోగా డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్.. సడన్‌గా పడిపోవడంతో.. ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో.. షూటింగ్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మధు, చంద్రన్ (ఫుడ్ ప్రోవైడర్స్) కాగా.. మరోకరు అసిస్టెంట్ డైరక్టర్ కృష్ణగా గుర్తంచారు. పూనమల్లి సమీపంలోని ఈవీపీ పిలిమ్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు మార్గమధ్యలోనే కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇక మరో ఐదుగురికి చికిత్స అందిస్తుండగా.. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరంతా సవిత మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో షూటింగ్ లోకేషన్‌లోనే దర్శకుడు శంకర్, నటుడు కమల్ హాసన్ ఉన్నారు.

Related Tags