Breaking News
  • కడప: ఫాతిమా ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటన. పాజిటివ్ వచ్చినవారికి ఫాతిమా ఆస్పత్రిలో చికిత్స. పాజిటివ్ కుటుంబ సభ్యులను క్వారంటైన్లకు తరలింపు.
  • హైదరాబాద్: శ్రీరామనవమి వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ పిలుపు. విజయవాడ: మద్యానికి బానిసలైన వారి పట్ల కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి, అనధికార మత్తు పదార్థాల విక్రయాలు జరిపితే ఫోన్‌ చేయాల్సిన నెం.18004254868, 9491030853, 08662843131కు కాల్‌ చేయండి-ఏపీ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ.
  • కృష్ణాజిల్లా: కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఎవరూ బయటకు రావొద్దు-మంత్రి పేర్నినాని. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మన చుట్టూనే వైరస్‌ పొంచి ఉంది-మంత్రి పేర్నినాని.
  • తాడేపల్లి: కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష. కేసులు పెరగడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. ఢిల్లీ వెళ్లి వచ్చినవారందరినీ గుర్తించి పరీక్షలు చేయాలన్న సీఎం.
  • వరంగల్ రూరల్: పర్వతగిరిలో గడపగడపకు వెళ్లి కరోనాపై అవగాహన కల్పించిన మంత్రి ఎర్రబెల్లి, మాస్కులు పంపిణీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు.

మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !

cracks in maharashtra alliance, మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలని, ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన.. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం లోని తమ పార్టీ మంత్రులతోను, పార్టీ నేతలతోనూ సోమవారం సమావేశమవుతున్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఒక రాష్ట్ర హక్కులను కేంద్ర పరిధిలోకి జొప్పించడం సరికాదని ఆయన భావిస్తున్నారు. అలాగే జాతీయ జనాభా గణన (ఎన్ పీ ఆర్) ప్రక్రియను మే 1 నుంచి అమలు చేయాలని  ఉధ్ధవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎన్సీపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్.. ఇలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 75 రోజుల ఉధ్ధవ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఎన్సీపీలు ‘దెబ్బ కొట్టే’ యత్నంలో ఉన్నాయా అని భావిస్తున్నారు. సీఏఏ, జాతీయ జనాభా గణన చట్టాలను ఈ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రెండో చట్టం అమలును ఆపివేయాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత జనవరిలోనే ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఎల్గార్ పరిషద్ కేసు 2017 నాటిది.. నాడు జనవరి 1 న భీమా-కోరేగావ్ కేసుతో ఇది ముడిపడి ఉంది. ఆ నాడు దళితులపై అగ్రవర్ణాల దాడులు, అనంతరం పౌర హక్కుల సంఘాల నేతల అరెస్టులు దేశంలో సంచలనం రేపాయి. వరవరరావు వంటి నేతలను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం విధించారు.

 

 

Related Tags