పాత పాట పాడుతున్న కామ్రేడ్స్..!

CPM Leaders situation of the party is good only when the Congress is an ally, పాత పాట పాడుతున్న కామ్రేడ్స్..!

కమ్యూనిస్టులు…నిత్యం ప్రజా పోరాటలతో ఇంతో అంతో అధికార పార్టీలను ఇరకాటంలో పెట్టేవారు. అంతేకాదు ప్రజా ప్రతినిధ్యం కూడా ఉండేది. కొన్ని సార్లు ప్రభుత్వాల ఏర్పాటులోనూ కీలకంగా మారారు. అయితే కొంతకాలంగా జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ, తెలంగాణలో కామ్రేడ్స్ ప్రభావం చాల తగ్గిపోయింది. వాళ్ల వాయిసే ఎక్కడ వినిపించకుండా పోయింది. ఎర్రజెండాలే కనిపించకుండా పోయాయి.

అయితే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కొత్త ప్రయోగానికి తెరతీశారు సీపీఎం నేతలు. ఏపార్టీ ముందుకు తీసుకురాని కొత్త ఎజెండాను జనం లోకి తీసుకెళ్లారు. బహుజనులందరిని ఏకం చేసేలా లాల్ నీల్ జెండాలను ఏకం చేశారు టీమాస్ పేరుతో పార్టీని ప్రమోట్ చేశారు. బీసీ నేతనే ముఖ్యమంత్రంటూ హామీలిచ్చారు. రాష్ట్రమంతా పాదయాత్రలు చేశారు. మీటింగ్ లు..పాదయాత్రలు బాగా వర్క్ అవుటా అయినా..ఓట్లలో మాత్రం ఖంగుతిన్నారు కామ్రేడ్స్. గతంలో ఉండే ఓటు బ్యాంక్ రాకపోవడంతో నిరాశ చెందారు.

ఇక ప్రయోగాలు వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్లీ ఎర్రజెండాతో వర్గపోరాటమే ముద్దనుకుంటున్నారట కామ్రేడ్స్. బీఎల్ఎఫ్, టీమాస్ ప్రయోగాన్ని పక్కన పెట్టి మళ్లీ కాంగ్రెస్ తో వామపక్ష దోస్తీని కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో చేస్తున్నారట సీపీఎం నేతలు. గతంలో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నప్పుడే పార్టీ పరిస్థితి బాగుందని…ఇప్పుడు అదే దోస్తీ కంటిన్యూ చేస్తే అటు జాతీయ స్థాయితో పాటు ఇటు తెలంగాణలోనూ ప్రజా ఉద్యమాల్లో దూసుకుపోవచ్చనే ప్లాన్ లో ఉన్నారట కామ్రేడ్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *