Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

కామ్రేడ్ల యూటర్న్‌ వెనుక కారణమేంటి ?

reasons behind cpi decision, కామ్రేడ్ల యూటర్న్‌ వెనుక కారణమేంటి ?

తుది అంకానికి చేరుకున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీలో లేకుండానే బారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విశేషంగా వార్తలకెక్కింది. ఎన్నికల బరిలో వుండి ప్రత్యర్థులతో వాగ్బాణాలు సంధించే స్థితి  నుంచి వారికో.. వీరికో మద్దతిచ్చే స్థాయికి పడిపోయిన కామ్రేడ్లు.. ఉప ఎన్నిక సందర్భంగా వేసిన పిల్లి మొగ్గలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు ముందుగా గత ఎన్నికల్లో ఏర్పాటైన మహాకూటమి అలాగే వుంటుందా లేక ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా విడివిడిగా పోటీ చేస్తారా అన్న చర్చ మొదలైంది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్, టిడిపి ఎవరికి వారే పోటీ  చేసేందుకు సిద్దమై తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్తులైన టిజెఎస్, సిపిఐ పార్టీలు ఎటు మొగ్గుచూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. కోదండరామ్ నేతృత్వంలోని టిజెఎస్.. సహజంగానే కెసీఆర్ మీదున్న ద్వేషంతో కాంగ్రెస్ పక్కన చేరింది. ఇక మిగిలింది సిపిఐ.. కాగా ఈ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీతోపాటు.. టిఆర్ఎస్ పార్టీకూడా ప్రయత్నించింది. కారణాలపై ఎన్నో ఊహాగానాలు చెలరేగినా చివరికి సిపిఐ నేతలు టిఆర్ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించారు.

ఆ తర్వాతే అసలు ట్విస్టు మొదలైంది. ఈలోగా తెరమీదికొచ్చిన ఆర్టీసీ సమ్మె.. సిపిఐ నిర్ణయంపై పెను ప్రభావాన్ని చూపింది. నిజానికి టిఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్‌కు సిపిఐ నేతలు లొంగిపోయారని సోషల్ మీడియా కోడై కూసింది. ఈక్రమంలో మొదలైన ఆర్టీసీ సమ్మె.. అందులో కీలక భాగస్వామి అయని ఎంప్లాయిస్ యూనియన్.. సిపిఐ నేతలపై ఒత్తిళ్ళకు దిగింది. నిజానికి సిపిఐ పార్టీ అనుబంధ సంఘాల్లో ఎంతో కొంత ప్రభావం కలిగి వున్న సంఘం ఏదైనా వుందీ అంటే అది కేవలం ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే. అలాంటి ఈయూ ఒత్తిడికి సహజంగానే సిపిఐ పెద్దలు లొంగాల్సి వచ్చిందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఒక వైపు కాస్తో కూస్తూ మిగిలిన క్యాడర్ … ఎంప్లాయిస్ యూనియన్‌దే.. అలాంటి అనుబంధ సంఘాన్ని కాదనే ధైర్యం లేకపోవడంతో సిపిఐ నాయకత్వం వారి డిమాండ్ మేరకు హుజూర్‌నగర్లో టిఆర్ఎస్‌ పార్టీకిచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. యూ టర్న్ తీసుకున్నారన్న అపవాదును మోసేందుకు కూడా సిపిఐ నేతలు సిద్దపడ్డారంటే అది ఈయూ ఒత్తిడి ఫలితమేనన్నది నిర్వివాదాంశం. అయితే.. కొన్ని వర్గాలు సిపిఐ యూ టర్న్ వెనుక మరో కారణాన్ని కూడా చూపుతున్నాయి.

గులాబీ పార్టీ నుంచి సిపిఐ నేతలు భారీ నజరానా పొందారని, చాడా వెంకట రెడ్డి లాంటి నేతలకు ఎమ్మెల్సీ పదవిని కూడా కెసీఆర్ ఆఫర్ చేశారని సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రత్యక్షమవడం కూడా సిపిఐ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై చాడాను పలువురు పార్టీ సీనియర్లు నిలదీయడంతో ఆయన కినుక వహించారని సమాచారం. ఈ క్రమంలో ఈయూ ఒత్తిడి రావడంతో.. దాన్ని అనుకూలంగా మార్చుకుని యూ టర్న్‌కు సిపిఐ రాష్ట్ర నాయకత్వం సిద్దమైందని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరని మరోసారి నిరూపణ అయ్యిందీ ఈ ఉదంతంతో…

Related Tags