Breaking News
  • విజయవాడ: ఢిల్లీ అల్లర్ల బాధితుల కోసం సీపీఎం విరాళాల సేకరణ. మార్చి 2, 3 తేదీల్లో విరాళాలు సేకరించాలని పార్టీ శాఖలకు పిలుపు. సహృదయులైన దాతలు ఆదుకోవాలని కోరుతున్నాం-సీపీఎం ఏపీ కార్యదర్శి మధు.
  • చెన్నై: వేలూరు డిప్యూటీ కలెక్టర్‌ దినకరన్‌ అరెస్ట్‌. అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదు లభ్యం. తిరువన్నామలైకి చెందిన రంజిత్‌ కుమార్‌ భూముల విక్రయంలో ఆరోపణలు. ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు రూ.76 లక్షల నగదు లభ్యం.
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు. మార్చి 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు. మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం.
  • నోరు తెరిస్తే 14 ఏళ్లు సీఎంగా చేశా అంటారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులేయడం.. మీ మానసిక దౌర్భల్యాన్ని బయటపెడుతోంది. మీరు జీతాలిచ్చే హెరిటేజ్‌ స్టాఫ్‌ కూడా మాటలు పడరు.
  • ఢిల్లీలో 14 విమానాల దారి మళ్లింపు. వాతావరణం అనుకూలించక విమానాల దారి మళ్లింపు. లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌ ఎయిర్‌పోర్టులకు మళ్లించిన అధికారులు.

సీపీఐ మద్దతు లేకున్నా.. హుజూర్‌నగర్ గులాబీదే.. !

CPI may withdraw its support to trs in Huzurnagar Bypoll.. But Also Have Chances To Win TRS, సీపీఐ మద్దతు లేకున్నా.. హుజూర్‌నగర్ గులాబీదే.. !

హుజూర్‌నగర్ ఉప పోరు.. రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య విజయం ఎవరిదన్న దానిపై ఓ అంచనా రావడానికి లేకుండా పోయింది. నిన్నటి వరకు టీఆర్ఎస్‌కు మద్దుతు తెల్పుతున్నామన్న సీపీఐ యూ టర్న్‌ తీసుకోవడంతో.. ఉప పోరు మరింత రసవత్తరంగా మారింది. సీపీఐ యూ టర్న్ తీసుకున్నా కూడా.. టీఆర్ఎస్‌కు నష్టం లేదని అభిప్రాయపడుతున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. మరోవైపు కాంగ్రెస్‌కు ఇది సిట్టింగ్ స్థానం కావడంతో.. గెలుపుపై గుప్పెడు ఆశలతో ఉంది. అయితే టీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో.. కాంగ్రెస్ ఆశలు ఆవిరైపోయినట్లే కనిపిస్తోంది. హుజూర్ నగర్‌ ఉపపోరులో సీపీఐ మద్దతు తెల్పకున్నా.. ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తొలుత టిఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తామని ప్రకటించిన సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి.. ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపిస్తూ టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్లే అని అంతా అనుకున్నా.. ఇది టీఆర్ఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపదని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి అసలు కారణాన్ని విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో బై పోల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. గతేడాది ఉత్తమ్ కుమార్ ఒంటరిపోరులో గెలవలేదని.. అప్పుడు మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించారని పేర్కొన్నారు.

అయితే ఈ సారి మాత్రం సీన్ రివర్స్‌ అయ్యింది. అప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలు కూడా ఈ సారి బరిలోకి దిగడం కాంగ్రెస్‌‌ పార్టీకి మైనస్‌గా మారింది. గతంలో టీఆర్ఎస్ కేవలం 7 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎంతో పుంజుకుంది. అప్పటి కంటే ఎక్కువ క్యాడర్ నిర్మాణం జరిగింది. అదే సమయంలో ఇటీవల ఇతర పార్టీలకు చెందిన నేతలు, గ్రామ సర్పంచ్‌లు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే గతంలో మద్దతు తెల్పిన టీడీపీ ఈ సారి అభ్యర్థిని బరిలోకి దింపింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు తెల్పడం లేదు. ఇక బీజేపీ అప్పట్లో కేవలం రెండు వేల లోపు ఓట్లను మాత్రమే సాధించగా.. ఇప్పుడు తన ప్రభాల్యం చూపేందుకు విశ్వప్రయత్నాలు చూస్తోంది. అందుకు ఈ సారి ప్రచారంలో కూడా కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఇదే అంశం టీఆర్ఎస్‌ పార్టీ గెలుపుకు దోహదం కానుంది. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు సేఫ్‌గా ఉండడానికి తోడుగా.. ప్రత్యర్థి కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు తమ మద్దుతును కాంగ్రెస్‌కు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ యూ టర్న్‌ తీసుకున్నా.. హుజూర్‌నగర్‌లో ఈ సారి గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని తెలుస్తోంది.

Related Tags