జగన్‌‌ను చూసి.. కేసీఆర్ నేర్చుకోవాలి..!

CPI Leader Narayana, జగన్‌‌ను చూసి.. కేసీఆర్ నేర్చుకోవాలి..!

పార్టీ ఫిరాయింపులకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్ పాషాతో సహా పలువురు నేతలు, కార్యకర్తలు పొల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు సిగ్గువిడిచి పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోడీ, అమిత్‌ షా, కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం వంటింటి కుందేలన్నారు. ఏపీ సీఎం జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఆశ్చర్యపరిచిందన్నారు. పార్టీ ఫిరాయింపులకు తాము దూరమని చెప్పిన జగన్‌ను చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *