టీవీ9 సాహసోపేత ప్రయత్నం భేష్ : సీపీ సజ్జనార్‌

వెళ్తుంది గోవాకే కదా అని దండిగా డబ్బులు ఇచ్చి పంపిస్తే...యువత భవిత మత్తులో జారీ గల్లంతడం ఖాయం. ముంబై డ్రగ్‌ కేసు నేపథ్యంలో అలాంటి ప్రమాదాన్ని పసిగట్టిన టీవీ9 పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఆపరేషన్‌ చార్మిని చేపట్టింది.

టీవీ9 సాహసోపేత ప్రయత్నం భేష్ : సీపీ సజ్జనార్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 6:44 AM

వెళ్తుంది గోవాకే కదా అని దండిగా డబ్బులు ఇచ్చి పంపిస్తే…యువత భవిత మత్తులో జారీ గల్లంతడం ఖాయం. ముంబై డ్రగ్‌ కేసు నేపథ్యంలో అలాంటి ప్రమాదాన్ని పసిగట్టిన టీవీ9 పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి ఆపరేషన్‌ చార్మిని చేపట్టింది. కామన్‌మెన్‌గా గోవాలో అడుగుపెట్టిన టీవీ9 బృందానికి ఊహించిన దానికన్న ఈజీగా డ్రగ్స్‌ చేజిక్కాయి. అంతేకాదు డ్రగ్‌ టాన్స్‌పోర్టేషన్‌కు గోవా- హైదరాబాద్‌ రహదారి ఎందుకు కారిడార్‌గా మారిందో నిర్లక్ష్య జాడలు స్పష్టంగా కన్పించాయి. గోవాలో విచ్చలవిడిగా డ్రగ్‌ విక్రయాలు.. డ్రగ్‌ అక్రమ రవాణాపై టీవీ9 ఆపరేషన్‌ చార్మి ఎక్స్‌పోజివ్‌ రిపోర్టింగ్‌లో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. టీవీ9 ఆపరేషన్‌ను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అభినందించారు. కామన్‌మ్యాన్‌గా గోవాలో కొనుగోలు చేసిన డ్రగ్స్‌ను సీపీకి హ్యాండోవర్‌ చేశారు టీవీ9 టీమ్‌. అంతేకాదు చెక్‌పోస్టుల దగ్గర నిర్లక్ష్యం..తూతు మంత్రంగా మారిన తనిఖీల వైనంపై నిఘాలో తేలిన నిజాలను సీపీకి వివరించారు.

సామాజిక బాధ్యతతో టీవీ9 సాహసోపేత ప్రయత్నం చేసిందన్నారు సీపీ సజ్జనార్‌. టీవీ9 బృందం అందించిన వివరాలతో డ్రగ్‌ దందాపై మరింత లోతుగా విచారణ జరుపుతామన్నారు. డ్రగ్స్‌ మాయలో పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారాయన. పిల్లల కార్యకలాపాలపై పేరెంట్స్ ఎప్పటికప్పుడు ఓ కన్నేసి వుంచాలని సూచించారు. సంచలన వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన టీవీ9 ఆపరేషన్‌ చార్మిపై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ స్పందించింది. టీవీ9 టీమ్‌కు డ్రగ్స్‌ విక్రయించిన గ్యాంగ్‌లపై కూపీలాగే పనిలో పడ్డారు. గతంలో డ్రగ్‌ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులకు ఆ ముఠాలకు లింక్‌లున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. తీసుకొచ్చిన డ్రగ్స్‌ను బాధ్యాతాయుతంగా సీపీ సజ్జనార్‌కు అప్పగించింది టీవీ బృందం.