సాగరతీరంలో న్యూ ఇయర్ సందడి.. యువతకు స్ట్రిక్ట్ వార్నింగ్!

కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలూ సన్నద్ధం అయ్యారు. దీనికి అనుగుణంగానే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు.. పసందైన ఆఫర్లతో యువతను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. అటు మందుప్రియుల కోసం రకరకాల తాయిలాలను కూడా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగరతీరం విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై సిటీ పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఒకసారి ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు చుద్దాం..  డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ రేసర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్న […]

సాగరతీరంలో న్యూ ఇయర్ సందడి.. యువతకు స్ట్రిక్ట్ వార్నింగ్!
Follow us

|

Updated on: Dec 31, 2019 | 12:56 PM

కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలూ సన్నద్ధం అయ్యారు. దీనికి అనుగుణంగానే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు.. పసందైన ఆఫర్లతో యువతను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. అటు మందుప్రియుల కోసం రకరకాల తాయిలాలను కూడా ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగరతీరం విశాఖలో న్యూ ఇయర్ వేడుకలపై సిటీ పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక ఆంక్షలు విధించారు.

ఒకసారి ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు చుద్దాం.. 

డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ రేసర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్న పోలీసులు.. అల్లరిమూకలు, మందుబాబులపై బాడీ వార్న్ కెమెరాలతో నిఘా ఉంచుతామని తెలిపారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు రంగంలోకి 50 డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలను దింపనున్నట్లు సీపీ ఆర్కే మీనా తెలిపారు. తాగి డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. జిగ్ జాగ్, ట్రిపుల్ రైడింగ్ చేసే వారి వాహనాలను కూడా సీజ్ చేస్తామని చెప్పారు. అటు న్యూ ఇయర్ వేడుకల్లో పిల్లలకు వాహనాలిచ్చే యజమానులపైనా కఠిన చర్యలు తప్పవన్నారు.

మరోవైపు తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 వరకు క్లోజ్‌ అయ్యి ఉంటుందని.. బీచ్ రోడ్ పరిసరాల్లో కూడా ఆంక్షలు విధించామని తెలిపారు. అంతేకాకుండా బీచ్ రోడ్‌కు వెళ్ళే వారి కోసం 5 చోట్ల ప్రత్యేక పార్కింగులను ఏర్పాటు చేశామన్నారు. కాగా, నిబంధనలు పాటించని ఈవెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఆర్కే మీనా స్పష్టం చేశారు.

అరకు పరిసరాల్లోనూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు…

1.టూరిస్టుల కదలికలపై నిఘా.. రంగంలోకి ప్రత్యేక బలగాలు

2.లాడ్జిలు, హోటళ్ళకు ప్రత్యెక సూచనలు