విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతాం.. వార్నింగ్ ఇచ్చిన సీపీ.

గ్రేటర్ ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే కొంత మంది సోషల్ మీడియాలో ప్రజలకు లేని పోని అపోహలు కల్పిస్తున్నారని ప్రజల్లో అశాంతిని రేకెత్తించడం వంటివి చేస్తున్నారని సీపీ అంజనీకుమార్ అన్నారు…

  • Rajeev Rayala
  • Publish Date - 9:11 am, Fri, 27 November 20

గ్రేటర్ ఎన్నికల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే కొంత మంది సోషల్ మీడియాలో ప్రజలకు లేని పోని అపోహలు కల్పిస్తున్నారని ప్రజల్లో అశాంతిని రేకెత్తించడం వంటివి చేస్తున్నారని సీపీ అంజనీకుమార్ అన్నారు. నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు.

విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతామని తెలిపారు. ఏడేండ్లలో హైదరాబాద్ లో శాంతి భద్రతలు బాగుతున్నాయనీ, నేరాలు అదుపులో ఉండడంతోపాటు మత ఘర్షణలకు తావులేదని స్పష్టంచేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఫేక్‌న్యూస్‌తో వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంతతను భగ్నం చేసి మతసామరస్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నగర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు అందరు కృషిచేయాలని అంజనీకుమార్ కోరారు.