క‌రోనా అల‌ర్ట్ః ఐసోలేష‌న్ నుంచి త‌ప్పించుకున్న బాధితుడు..

ఏపీలో క‌రోనా క‌ల్లొలం రేపింది.ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 12 వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. తాజాగా, వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్య‌క్తి అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు...

క‌రోనా అల‌ర్ట్ః ఐసోలేష‌న్ నుంచి త‌ప్పించుకున్న బాధితుడు..
Follow us

|

Updated on: Mar 27, 2020 | 1:33 PM

ఏపీలో క‌రోనా క‌ల్లొలం రేపింది.ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 12 వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. తాజాగా, వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్య‌క్తి అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు. దీంతో ప్ర‌జ‌లు, అధికార యంత్రాంగం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అత‌డి వ‌ల్ల ఎంత‌మందికి ప్ర‌మాదం పొంచివుందోన‌నే భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గుంటూరులో కరోనా లక్షణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ ఓ యువకుడిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. కాగా, అత‌డు అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు. తన కేస్ షీట్ కూడా వెంట తీసుకొని పారిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు యువకుడిపై గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, గుంటూరులో కొన్ని కాలనీలను రెడ్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం.

రెడ్‌జోన్ ఏరియాల జాబితా.. మంగళదాస్ నగర్, అరుంధతి నగర్, RTC కాలనీ, అంబేద్కర్ నగర్, సీత నగర్, నెహ్రూ నగర్, వాసవి నగర్ ఉన్నాయి. ఈ ఏరియాల్లో ప్రజలు బయటికి రావొద్దని, బయటి నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 60 ఏళ్లు దాటిన‌వారెవరూ బయటకు రావొద్దని సూచించారు. ఈ ఏరియాల్లో శానిటైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే ఐసోలేష‌న్ నుంచి క‌రోనా పాజిటివ్‌గా తేలిన వ్య‌క్తి త‌ప్పించుకోవ‌టంతో అధికారులు, స్థానిక ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.