ఎన్ని కోవిడ్ వ్యాక్సీన్ బాటిల్లో ? బెల్జియంలో ఓ సీన్ !

కోవిడ్ మహమ్మారి పై పోరుకు వివిధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ల కోసం ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది.  ఎనిమిది నెలలు గడిచిపోయినా ఇంకా ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఇక ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సీ న్ దాదాపు అందుబాటులోకి వచ్చింది. బెల్జియంలోని  తమ సంస్థలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సీన్ల వయల్స్ (బాటిల్స్) రోల్ అవుతున్న ఫోటోలను ఆ కంపెనీ విడుదల చేసింది. అయితే ఇది సేఫ్ అవునా..కాదా ..దీని సామర్థ్యం తదితరాలు […]

ఎన్ని కోవిడ్ వ్యాక్సీన్ బాటిల్లో  ? బెల్జియంలో ఓ సీన్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 2:12 PM

కోవిడ్ మహమ్మారి పై పోరుకు వివిధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ల కోసం ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది.  ఎనిమిది నెలలు గడిచిపోయినా ఇంకా ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఇక ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సీ న్ దాదాపు అందుబాటులోకి వచ్చింది. బెల్జియంలోని  తమ సంస్థలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సీన్ల వయల్స్ (బాటిల్స్) రోల్ అవుతున్న ఫోటోలను ఆ కంపెనీ విడుదల చేసింది. అయితే ఇది సేఫ్ అవునా..కాదా ..దీని సామర్థ్యం తదితరాలు ప్రూవ్ కావలసి ఉంది. సురక్షితమైనదని తేలితేనే దీనికి అనుమతి లభిస్తుంది.

పర్మిషన్ ఇస్తే తాము 100 మిలియన్ డోసుల వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తామని బ్రిటన్ లోని ఫైజర్ కంపెనీ సీఈఓ బెన్ ఓస్ బోర్న్ అంటున్నారు. ఏమైనా… తొలి వయల్స్ బయటకి రావడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థతో కలిసి ఫైబర్ ఈ టీకా మందు ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 44 వేలమంది వలంటీర్లపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.