కోవిడ్ వ్యాక్సిన్ ప్రజల్ని ‘క్రోకడైల్స్’ లా మార్చేస్తుందట ! బ్రెజిల్ అధ్యక్షుని ఫైర్, తాను తీసుకోబోనని ప్రకటన

కోవిడ్ 19 వ్యాక్సిన్ పై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్స నారో ఇంతెత్తున మండిపడ్డారు. ఇది తీసుకున్నవారెవరైనా సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడితే అందుకు తాము బాధ్యత వహించబోమన్నారు. మీరు 'క్రోకడైల్స్' (మొసళ్లలా) మారితే అది మీ సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.

కోవిడ్ వ్యాక్సిన్ ప్రజల్ని 'క్రోకడైల్స్' లా మార్చేస్తుందట ! బ్రెజిల్ అధ్యక్షుని ఫైర్, తాను తీసుకోబోనని ప్రకటన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2020 | 10:28 AM

కోవిడ్ 19 వ్యాక్సిన్ పై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్స నారో ఇంతెత్తున మండిపడ్డారు. ఇది తీసుకున్నవారెవరైనా సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడితే అందుకు తాము బాధ్యత వహించబోమన్నారు. మీరు ‘క్రోకడైల్స్’ (మొసళ్లలా) మారితే అది మీ సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ప్రజలను మొసళ్లలాగానో, గెడ్డం వచ్చిన మహిళల మాదిరో మార్చేస్తుంది అన్నారు. ఈ టీకామందుపై ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేశారు. దీన్ని ‘లిటిల్ ఫ్లూ’ గా కూడా అభివర్ణించారు. తాను దీన్ని తీసుకునే ప్రసక్తి లేదన్నారు. దేశంలో మాస్ వ్యాక్సినేషన్ లాంచ్ చేసిన ఆయన.. ఈ టీకామందు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలను కూడా  దుయ్యబట్టారు. నాలో యాంటీ బాడీలు ఉన్నాయి.. అందువల్ల నేను దీన్ని తీసుకునే ప్రసక్తి లేదు అని జైర్ పేర్కొన్నారు. మీరు సూపర్ హ్యూమన్ గా మారినా, లేదా మొసళ్లలా మారినా ఆ సంస్థలకు పట్టదు అన్నారు. దేశంలో ప్రతివారూ ఈ టీకామందు తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదని ఆయన చెప్పారు.

ఇది తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తి అసలే ఉండదని ఆయన అన్నారు. బ్రెజిల్ లో 70 లక్షల పైగా  కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేలమంది కరోనా రోగులు మృతి చెందారు. గత జులైలో ఈ దేశాధ్యక్షునికి కరోనా సోకి మూడు వారాల అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది తిరగబెట్టడంతో అంతెత్తున మండిపడుతున్నారు.