కాలుష్య వ్యర్థాలతో కరోనా వ్యాప్తి : డాక్టర్‌ పి.రఘరామ్‌

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ విస్తరణకు తుమ్మర్లతో పాటు గాలి కాలుష్యం కూడా కారణభూతమవుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. వాతావరణ కాలుష్యం ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావం చూపించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.

కాలుష్య వ్యర్థాలతో కరోనా వ్యాప్తి : డాక్టర్‌ పి.రఘరామ్‌
Follow us

|

Updated on: Sep 07, 2020 | 11:55 AM

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ విస్తరణకు తుమ్మర్లతో పాటు గాలి కాలుష్యం కూడా కారణభూతమవుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి కాలుష్యం సృష్టించే పదార్థాలపైనే కరోనా వైరస్ అణువులు ఉంటున్నాయని గుర్తించారు. వాతావరణ కాలుష్యం ఆరోగ్యంపై దీర్ఘకాలిక దుష్ప్రభావం చూపించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తుందని అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ పి.రఘరామ్‌ అన్నారు. దీంతో కొవిడ్‌ వంటి అంటురోగాలు అధికంగా వ్యాపిస్తాయన్నారు. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న మొట్టమొదటి ‘క్లీన్‌ ఎయిర్‌ ఫర్‌ బ్లూస్కైస్‌’ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు వైద్య సంఘాలు ఆదివారం ఆన్‌లైన్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మనుషులపై కాలుష్యం చూపే ప్రభావాల గురించి చర్చించారు. కాలుష్యం కారణంగా ఇంధనాల ద్వారా వెలువడే వ్యర్థాలు శరీరంలో అనేక అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మారియా నీయరా అన్నారు.

కాగా, గతంలోనూ ఇటలీలోని పల్లె పరిసరాలు, పరిశ్రమ వాతావరణాల్లోని శాంపుల్స్ సేకరించారు. కాలుష్యంలో చాలా కాలం పాటు సజీవంగా ఉంటున్న వైరస్ మనుషులకు కచ్చితంగా హాని చేయగలదని నిరూపించలేపోయారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పొల్యూషన్ ఉండటం వల్ల పరిసర ప్రదేశాల వారికే కరోనా పాజిటివ్ ఎక్కువగా నమోదయ్యాయి. దీనిని బట్టే ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలు కరోనాను ఎక్కువగా వ్యాప్తి చేయగలవని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.