అంబులెన్స్‌లోనే కరోనా పేషేంట్ ప్రసవం

కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ.. అంబులెన్స్‌లోనే ప్రసవించింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా విపత్కర కాలంలో ఓ మహిళ ప్రసవానికి సహకరించిన సిబ్బంది నిజమైన మానవతావాదులని పొగడ్తలు కురిపించారు.

అంబులెన్స్‌లోనే కరోనా పేషేంట్ ప్రసవం
Follow us

|

Updated on: Aug 13, 2020 | 4:33 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వికృతరూపం దాల్చుతోంది. ఎవ్వరిని వదలకుండా అంటుకుంటోంది. కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ.. అంబులెన్స్‌లోనే ప్రసవించింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా విపత్కర కాలంలో ఓ మహిళ ప్రసవానికి సహకరించిన సిబ్బంది నిజమైన మానవతావాదులని పొగడ్తలు కురిపించారు.

కేరళకు చెందిన ఓ మహిళ (38) నిండు గర్భవతి. అయితే కొద్ది రోజులుగా ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది ఆమెకు పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో క్వారంటైన్ లో ఉంటూ కరోనా చికిత్స పొందుతోంది. ఓ వైపు కరోనా చికిత్స పొందుతూనే, పుట్టబోయే బిడ్డ గురించి తగిన జాగ్రత్తలు పడుతోంది. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వైద్య సిబ్బందికి సమాచారమిచ్చారు. అంతనే విషయం అందుకుని కొంత మంది సిబ్బందితో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. పురిటి నొప్పులతో ఉన్న మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రయాణంలో ప్రసవించింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ సిబ్బందే ఆమెకు సపర్యలు చేశారు. దీంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ విషయమై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. అంబులెన్స్ సిబ్బంది చూపిన చొరవను అభినందించారు.