Breaking News
 • అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నకు ఫీజు చెల్లించేందుకు పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం . బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు . పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను మంజూరు చేసిన ఆర్ధిక శాఖ.
 • కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగ్గురికి బెయిల్. ఎమ్మార్వో నాగరాజు పై మరో కేసు నమోదు కావడంతో బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంజిరెడ్డి, శ్రీనాథ్, విఆర్ఏ సాయి రాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
 • ఏసీపీ నర్సింహారెడ్డి ఏసీబీ కస్టడీ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా. ఏసీపీ నర్సింహారెడ్డి ని 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఏసీపీ నర్సింహారెడ్డి తరపు న్యాయవాది. వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ విచారణకు ను రేపటికి వాయిదా.
 • సైబరాబాద్ కమిష్నరేట్ మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ లో 25వ తేది అత్మహత్య చేసుకున్న ‌మహిళ కేసును చేదించిన మొయినాబాద్ పొలీసులు . అత్మహత్యకు కారకుడైనా భతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు . కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
 • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.
 • చెన్నై: ఎస్పీ బాలు హాస్పిటల బిల్లుల వివాదంపై ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం, ఎస్పీ చరణ్ సంయుక్త ప్రెస్ మీట్. మా ఆసుపత్రి మీద రూమర్లు సృష్టించవద్దు. బిల్లుల విషయంలో ఎలాంటి వివాదం లేదు. మేము ప్రతివారం బిల్లులు చెల్లిస్తూనే ఉన్నాము. చివర్లో బిల్లు కట్టవలసిన అవసరం లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. కానీ మూడు కోట్ల బిల్లు అయిందని ఇంకా కోటిన్నర పెండింగ్ ఉందని అందుకనే నాన్నగారి భౌతిక కాయాన్ని అప్పగించలేదని కట్టు కథలు అల్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన కుమార్తె దీపా వెంకట్ బిల్లు చెల్లించారంటూ ప్రచారం చేశారు. మేము నాన్నని కోల్పోయి బాధలో ఉంటే మమ్మల్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఇంకా బాధ పెడుతున్నారు. తామరై పక్యం లో నాన్నగారి స్మృతి వనం నిర్మిస్తాము. నాన్నగారి కి భారత రత్న వస్తే సంతోషమే.. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఎప్పుడూ ఆయన భారతరత్నే. ఆయన ఏ ప్రోగ్రామ్ కి హాజరైనప్పుడు కరోనా సోకిందనేది ఇప్పుడు అప్రస్తుతం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది..మేము నాన్నగారిని కోల్పోయాము. ఇప్పటికైనా నాన్నగారి మీద దుష్ప్రచారాలు ఆపండి.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే!

Covid Emergency Numbers In AP, ఏపీ ప్రజలకు అలెర్ట్.. కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే!

Covid Emergency Numbers In AP: కరోనా సమాచారానికై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ప్రజలకు కొండంత భరోసాను ఇస్తున్నాయి. సామాన్యులకు రాష్ట్రంలోని క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు, డాక్టర్లు, ఏఎన్‌ఎంల వివరాలు తెలపడమే కాకుండా కరోనా బాధితులకు, అనుమనితులకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు. కరోనా పాజిటివ్ బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. శ్వాసకోశ, దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్లకు ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని.. అలాగే స్వల్ప లక్షణాలు ఉంటే వైద్యుల చికిత్స మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చునని వివరిస్తున్నారు. ఇక రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన నెంబర్లు, కోవిడ్ కాల్ సెంటర్ల నెంబర్లు ఇలా ఉన్నాయి.

వివిధ సమస్యలకు రాష్ట్రస్థాయిలో అందుబాటులో ఉన్న నెంబర్లు..

 • స్టేట్ కంట్రోల్ రూమ్ – 0866-2410978, 104
 • అత్యవసర సేవలకు – 108
 • ఆరోగ్య సమస్యలకు – 14410
 • వాట్సాప్ నెంబర్ – 8297104104

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ కాల్‌సెంటర్‌ నెంబర్లు..

 • శ్రీకాకుళం – 6300073203
 • విజయనగరం – 08922–227950, 9494914971
 • విశాఖపట్నం – 9666556597
 • తూర్పుగోదావరి – 0884-2356196
 • పశ్చిమగోదావరి – 18002331077
 • కృష్ణా – 9491058200
 • గుంటూరు – 08632271492
 • ప్రకాశం – 7729803162
 • నెల్లూరు – 9618232115
 • చిత్తూరు – 9849902379
 • వైఎస్సార్ కడప‌ – 08562–245259
 • అనంతపురం – 08554–277434
 • కర్నూలు – 9441300005

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

Related Tags