క్వారంటైన్ నుంచి త‌ప్పించుకున్నాడు..కానీ, మృత్యువు వ‌ద‌ల్లేదు..

హ‌ర్యానాలో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తి ఐసోలేష‌న్ నుంచి త‌ప్పించుకున్నాడు. అధికారుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకునే క్ర‌మంలోనే ప్ర‌మాద వ‌శాత్తు అత‌డు మృత్యువాత ప‌డ్డాడు. అత‌డి మ‌ర‌ణానంత‌రం కొత్త కోణం వెలుగుచూసింది. ఈ సంఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… హ‌ర్యానాలోని పాణిప‌ట్టు జిల్లా నూర్‌పూర్ గ్రామంలో ఓ వ్య‌క్తికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో ఏప్రిల్ 1న అత‌న్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేర్పించారు. క‌ర్న‌ల్‌లోని క‌ల్పాన‌చౌవ్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో […]

క్వారంటైన్ నుంచి త‌ప్పించుకున్నాడు..కానీ, మృత్యువు వ‌ద‌ల్లేదు..
Follow us

|

Updated on: Apr 06, 2020 | 2:59 PM

హ‌ర్యానాలో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తి ఐసోలేష‌న్ నుంచి త‌ప్పించుకున్నాడు. అధికారుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకునే క్ర‌మంలోనే ప్ర‌మాద వ‌శాత్తు అత‌డు మృత్యువాత ప‌డ్డాడు. అత‌డి మ‌ర‌ణానంత‌రం కొత్త కోణం వెలుగుచూసింది. ఈ సంఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే…

హ‌ర్యానాలోని పాణిప‌ట్టు జిల్లా నూర్‌పూర్ గ్రామంలో ఓ వ్య‌క్తికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీంతో ఏప్రిల్ 1న అత‌న్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేర్పించారు. క‌ర్న‌ల్‌లోని క‌ల్పాన‌చౌవ్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేష‌న్ వార్డులో అత‌నికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అత‌డు ఐసోలేష‌న్ నుంచి త‌ప్పించుకోవాల‌నుకున్నాడు. అందుకోసం బిల్డిండ్ 6వ అంత‌స్తు నుంచి తాడు సాయంతో కింద‌కు దిగే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, దుర‌దృష్టవ‌శాత్తు మ‌ధ్య‌లోనే అత‌డు జారి కింద‌ప‌డిపోయాడు. దీంతో అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. మ‌ర‌ణానంత‌రం అత‌డికి తిరిగి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా నెగెటివ్‌గా వ‌చ్చింది. దీంతో అత‌డి కుటుంబంలో విషాదం నెల‌కొంది.