Breaking News
  • ఢిల్లీ: ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌ల గడువు పొడిగింపు . 2019-20 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌ల దాఖలకు గడువు పెంపు . పన్ను రిటర్న్‌లకు 2021 జనవరి 31 గడువు పెంపు . ప్రకటించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ . కోవిడ్‌-19 నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం .
  • విజయవాడ: ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న కిషన్‌రెడ్డి . స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర నాయకులు . హైందవి కార్యాలయంలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి . రాత్రికి హోటల్లో బస..రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న మంత్రి . తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి పయనం .
  • కరోనా బాధితులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లతో చంద్రబాబు వెబినార్‌. కరోనా ఉధృతిపై రోజువారీ ఆడిట్‌ చేసుకోవాలి . సమర్థవంతంగా హ్యాండిల్‌ చేయగలిగేవారే సంక్షోభం అధిగమించగలరు . కరోనా కష్టకాలంలో మనవంతు బాధ్యతలను నిర్వహిస్తున్నాం. కేసుల సంఖ్యలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది . మరణాల సంఖ్యలో దేశంలోనే ఏపీది 5వ స్థానం . దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 30 జిల్లాల్లో 5 జిల్లాలు ఏపీవే .
  • మెదక్‌ జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో విషాదం . ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి. పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో ఘటన . బతుకమ్మను చెరువులో వదిలేందుకు వెళ్లి మునిగిన యువకుడు .
  • అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త . డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌. 2018 జూలై నుంచి 2019 డిసెంబర్‌ వరకు పెండింగ్‌లో ఉన్న.. మూడు డీఏల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌. కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్‌ నెల.. సగం జీతాలను 5 విడదల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం .
  • జమ్మూకశ్మీర్‌: గుపాకర్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లా. పేరును ప్రతిపాదించిన మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఆర్టికల్‌ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఫ్తీ. కేంద్రం తీరును నిరసిస్తూ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు .
  • ఢిల్లీ:దేశ ప్రజలకు విజయదశిమి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి . చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయదశిమి . కోవిడ్‌ నిబంధనలకు లోబడి పండుగను జరుపుకోవాలి-వెంకయ్యనాయుడు .

కరోనా టెస్ట్ కోసం రోబోలు..

లక్షలాది మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ రక్కసిపై పోరులో ముందువరుసలో నిలబడి పనిచేస్తున్నారు కరోనా వారియర్స్. ఈ వైరస్ బారి నుంచి వారి కాపాడేందుకుసింగపూర్‌ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది.

COVID 19 Sinagapore Develops Robot Swab Tests, కరోనా టెస్ట్ కోసం రోబోలు..

ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తోంది. మాయదారి రోగం బారిన పడి కోట్లాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. లక్షలాది మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ రక్కసిపై పోరులో ముందువరుసలో నిలబడి పనిచేస్తున్నారు కరోనా వారియర్స్. ఈ వైరస్ బారి నుంచి వారి కాపాడేందుకుసింగపూర్‌ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది. శాంపిల్స్ సేకరించే టైంలో కరోనా అంటుకోకుండాలన్న లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించవచ్చంటున్నారు.

ఇకపై కొత్తగా రూపొందించిన ‘స్వాబోట్‌’ తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించాలని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోంది. నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ సింగపూర్‌ (ఎన్‌సీసీఎస్‌), సింగపూర్‌ జనరల్‌ ఆస్పత్రి (ఎస్‌జీహెచ్‌) వైద్యులు మెడికల్‌ రొబొటిక్స్‌ టెక్నాలజీ కలిగిన బయోబోట్‌ సర్జికల్‌ సంస్థ భాగస్వామ్యంతో ‘స్వాబోట్‌’ను అభివృద్ధి చేసినట్టు న్యూస్‌ ఆసియా ఛానల్‌ వెల్లడించింది. శిక్షణ కలిగిన తమ దేశ ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ ముప్పు లేకుండా.. కరోనా టెస్టుల్లో వారి సేవల్ని పరిమితం చేసేలా ఈ రోబోలను తయారు చేసినట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ముక్కు నుంచి ఆటోమేటిక్‌గా ఈ రోబోలే స్వాబ్‌ తీస్తాయని ఆ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ స్వాబోట్‌ స్వీయ నిర్వహణ కలిగినదని, రోగులు దీన్ని తమ ఇష్టప్రకారం వినియోగించుకొనే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

కరోనా పరీక్షలకు సిద్ధమైన వాళ్లు తమ గడ్డాన్ని రోబో దగ్గరకు తీసుకురాగానే అది యాక్టివేట్‌ అవుతుంది. అనంతరం స్వాబింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. నాసికా రంధ్రాల నుంచి దాదాపు 10.సెం.మీల మేర లోపలకు వెళ్లి నాసికా కుహరంలో స్వాబ్‌ను సేకరిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో సున్నితమైన ఈ ప్రక్రియలో సర్జన్ల మాదిరిగానే ఇది చాలా సున్నితంగా.. కచ్చితత్వంతో స్వాబ్‌ తీస్తుందని ఎస్‌జీహెచ్‌ వైద్యులు డాక్టర్‌ లూకే టే చెప్పారు. ముక్కు నిర్మాణం, ఆకృతుల్లో తేడా ఉన్నప్పటికీ నమూనాల నాణ్యత మాత్రం స్థిరంగా ఉంటుందని వైద్యులు వివరించారు.

Related Tags