Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం. విశాఖ సాల్వెంట్స్ లో పేలిన ట్యాంకులు. భారీగా ఎగసిపడుతున్మ మంటలు.. దట్టంగా అలుముకున్న పొగ. ప్రమాదంలో పలువురు చిక్కుకున్నట్టు అనుమానం. రంగంలోకి ఫైర్ సిబ్బంది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్‌కు టోకరా విషయంలో గతఇన్‌చార్జ్ తహసీల్దార్‌ నిర్మలాకిృష్ణను సస్పెండ్‌చేసిన కలెక్టర్‌ శ్యామ్యూల్‌ఆనంద్‍. గుంటూరు సెంట్రల్‌బ్యాంక్‌లో తీసుకున్నలోన్‌ఎమౌంట్‌కట్టిన రైతులు. ఒకకోటి తొమ్మిదిలక్షల డెభ్బైవేల బ్యాంక్‌కు జమచేసిన రైతులు.
  • ప్రకాశంజిల్లా కలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు... లాక్‌డౌన్‌ సడలింపులు చేయాలంటూ కలెక్టర్‌తో సమావేశమైన వ్యాపారస్తులతో ఛలోక్తులు విసిరిన కలెక్టర్‌ ... నాకంటే బాగా పనిచేస్తున్నారని ఎవరైనా భావస్తే ఒకరోజు కలెక్టర్‌గా పనిచేసేందుకు అవకాశమిస్తా... పనిచేసి చూపించడండి.. కలెక్టర్‌ పోలా భాస్కర్.
  • కడపజిల్లా: ప్రొద్దుటూరు వై.సి.పి.లో రెండు వర్గాలు మధ్య ఘర్షణ. మహమ్మద్ గౌస్ అనే కౌన్సిలర్ అభ్యర్థి పై బీరు బాటిళ్లు,ఇనుపరాడ్లతో అదే పార్టీకి చెందిన చెందిన మైనార్టీ నాయకుల దాడి. తీవ్ర గాయాలు ..ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.పరిస్థితి విషమం. స్థానిక సంస్థల ఎన్నికల నాటి విభేదాలతో దాడి.
  • సైఫాబాద్ పి ఎస్ పరిధిలోని ఓ బ్యాంకు సమీపంలో ఫుట్ పాత్ పై తన కూతురుతో నిద్రపోయినా బేగం అనే మహిళ. ఇదే అదునుగా భావించిన నలుగురు నిందితులు రెండు సంవత్సరాల చిన్నారి మహీన్ కిడ్నాప్ చేసి పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు షరీఫ్ మొహమ్మద్ ఫీర్దొస్ లను అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా కాపాడి తల్లి బేగం కు చిన్నారినీ అప్పగించారు.
  • వికారాబాద్ పట్టణంలో కరోనా వైరస్ పాసిటివ్ కేసులు ఎక్కువడంతో అన్నిరకాల వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు కరోనా వైరస్ వ్యాప్తినియంత్రించేందుకు వికారాబాద్ పట్టణ వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు 10 రోజుల పాటు పట్టణము లోని అన్ని షాపులను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించాలి అని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.
  • విశాఖ: క్రైమ్ డీసిపీ సురేష్ బాబు కామెంట్స్ . పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించాము. ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. విచారణ అనంతరం వాస్తవాలు బయటికి వస్తాయి.

అరటి తోటలను దెబ్బతీస్తున్న కొవిడ్‌-19

మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన ప్రాణాంతక కరోనా మహమ్మారి.. పంటలనూ వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అరటి తోటలకు సోకి.. పంటను నాశనం చేస్తోంది.
Banana Covid hits plantations, అరటి తోటలను దెబ్బతీస్తున్న కొవిడ్‌-19

మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన ప్రాణాంతక కరోనా మహమ్మారి.. పంటలనూ వదలడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అరటి తోటలకు సోకి.. పంటను నాశనం చేస్తోంది. ట్రాపికల్‌ రేస్‌ 4 అనే ఈ వైరస్‌.. వరల్డ్‌ వైడ్‌గా 26 బిలియన్ల అరటి వ్యాపారాన్ని దెబ్బతీసింది. టీఆర్‌ 4 అనేది మొక్కల వ్యాధుల్లో అత్యంత వినాశకరమైనదని.. మొక్కల్లో దీన్ని కొవిడ్‌-19గా చెబుతున్నారు.

అయితే ట్రాపికల్‌ రేస్‌ 4 అనే వైరస్‌ను మొదట తైవాన్‌లో గుర్తించారు. అక్కడి నుంచి ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా నుంచి లాటిన్ అమెరికా వరకు చేరుకుంది. ఇది మొదట ఆకులపై దాడి చేసి.. కాండంను తొలిచేస్తుంది. ఆ తర్వాత తోటలను నిర్వీర్యం చేస్తోంది. ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు ఇప్పటివరకు సమర్థవంతమైన మందు లేదు.

ఇండియాలో బీహార్‌, యూపీ ఈ వైరస్‌కు కేంద్రాలుగా మారాయి. బీహార్‌లోని కతిహార్‌, పూర్నియా..యూపీలోని మహారాజ్‌గంజ్‌ హాట్‌స్పాట్స్‌గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో టీఆర్‌ 4ను గుర్తించినట్లు ప్రకటించారు నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బనానాస్ ఎన్‌ఆర్‌సీబీ డైరెక్టర్‌ ఉమ. అయితే టీఆర్‌ 4 దేశంలోకి ఎలా చొరబడిందో నిర్థారించలేకపోయిన శాస్త్రవేత్తలు.. కతిహార్‌లో పరిశోధనలు చేస్తున్నారు.

దాదాపు 9 నెలల క్రితం దేశంలోకి ప్రవేశించి ఉంటుందని ప్రకటించారు ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ హార్టీకల్చర్‌ సైన్సైస్‌ అధ్యక్షుడు కేఎల్‌ చద్దా. పంట దెబ్బతిన్న పొలాలను వదిలేసి.. ముందు ఒకటి రెండేళ్లు వరి ధాన్యాన్ని సాగుచేయాలని.. అప్పుడు వైరస్‌ చైన్‌ కట్‌ అవుతుందని తెలిపారు. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల సమిష్టి కృషితోనే వైరస్ కట్టడి సాధ్యమని అంటున్నారు.

మన దేశంలో సుమారు వంద రకాల అరటి సాగవుతుంది. ఏడాదికి 27 మిలియన్‌ టన్నుల అరటిని ఉత్పత్తి చేస్తూ.. ప్రపంచంలోనే అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశంగా నిలచింది. టీఆర్‌ 4 వైరస్‌కు ఇండియా హాట్‌స్పాట్‌గా మారడం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది.

Related Tags