అమెజాన్ ఆదిమవాసులకూ కరోనా.. బ్రెజిల్ ఆందోళన

అమెజాన్ అటవీ ప్రాంతంలో.. దట్టమైన చెట్ల మాటున నివసించే ఆదివాసీల్లో కూడా ఏడు కరోనా వైరస్ కేసులు బయటపడడంతో బ్రెజిల్ ఆందోళన చెందుతోంది. 'యానోమామి' అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి ఈ కేసులు కంఫామ్.......

అమెజాన్ ఆదిమవాసులకూ కరోనా.. బ్రెజిల్ ఆందోళన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 09, 2020 | 12:54 PM

అమెజాన్ అటవీ ప్రాంతంలో.. దట్టమైన చెట్ల మాటున నివసించే ఆదివాసీల్లో కూడా ఏడు కరోనా వైరస్ కేసులు బయటపడడంతో బ్రెజిల్ ఆందోళన చెందుతోంది. ‘యానోమామి’ అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి ఈ కేసులు కంఫామ్ అయినట్టు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా తెలిపారు. నిజానికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండని  ఈ తెగకు కరోనా సోకడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. . వీరికే ఈ మహమ్మారి సోకిందంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. యానోమామి తెగకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడికి ఈ వైరస్ సోకగా ఆసుపత్రిలో ఐ సీ యు లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. మొదట వారం రోజుల క్రితం ‘కోకామా’ తెగకు చెందిన 20ఏళ్ళ మహిళకు కరోనా సోకింది. బ్రెజిల్ అటవీ ప్రాంతాల్లో 300 కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు అంచనా.

బ్రెజిల్ లో కూడా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. తమకు కూడాకరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు కావాలని ఆ దేశ అధ్యక్షుడు బొల్సొనారో.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందుకు మోదీ సానుకూలంగా స్పందించారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..