కరోనా సైరన్‌…గ్రేటర్‌ పరిధిలోనే కొత్త కేసులు

గ్రేటర్‌ పరిధిలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 50 పాజిటీవ్‌ కేసులు నమోదు కాగా, ఇవన్నీ గ్రేటర్‌ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఇటీవల మర్కజ్‌ ఘటన నేపథ్యంలో వైరస్‌ విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. దీంతో నగరంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇటీవల పాతబస్తీలోని తలాబ్‌కట్టలో ఒకే కుటుంబంలో 21 మందికీ వైరస్‌ సోకడం గమనార్హం. మర్కజ్‌ నుంచి వచ్చిన ఆరుగురి నుంచి మరో 81 మందికీ వైరస్ సంక్ర‌మించిన‌ట్లుగా […]

కరోనా సైరన్‌...గ్రేటర్‌ పరిధిలోనే కొత్త కేసులు
Follow us

|

Updated on: Apr 17, 2020 | 12:25 PM

గ్రేటర్‌ పరిధిలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 50 పాజిటీవ్‌ కేసులు నమోదు కాగా, ఇవన్నీ గ్రేటర్‌ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఇటీవల మర్కజ్‌ ఘటన నేపథ్యంలో వైరస్‌ విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. దీంతో నగరంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇటీవల పాతబస్తీలోని తలాబ్‌కట్టలో ఒకే కుటుంబంలో 21 మందికీ వైరస్‌ సోకడం గమనార్హం. మర్కజ్‌ నుంచి వచ్చిన ఆరుగురి నుంచి మరో 81 మందికీ వైరస్ సంక్ర‌మించిన‌ట్లుగా తేలింది. అయితే మర్కజ్‌ నుంచి వచ్చిన వాళ్లలో అనేక మంది ఇప్పటికీ సొంతంగా వైద్య పరీక్షలకు హాజరుకాకపోవడంతో వైరస్‌ విజృంభిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా మర్కజ్‌ వెళ్లొచ్చిన వాళ్లు స్వయంగా ప్రభుత్వ వైద్యాధికారులకు సహకరించడంతో పాటు పరీక్షలకు హాజరుకావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
మరోవైపు వైర‌స్ హమ్మారి రోజు రోజుకు విస్తరిస్తూ భయభ్రాంతులకు చేస్తుంది. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపడుతుంది. కరోనా వైరస్‌ సోకినా ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ యంత్రాంగం తమ ఆధీనంలోకి తీసుకుని వంద ఇళ్లకు ఒక కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి నో ఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేసి..కంటైన్మెంట్‌లోని ప్రజలు బయటకు రాకుండా, బయటి వాళ్లు లోనికి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ఇంత‌వ‌ర‌కు వృద్ధులను భ‌య‌పెట్టిన క‌రోనా వైర‌స్‌..ఇప్పుడు యువ‌త‌తో పాటు చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. అభంశుభం తెలియని పసికందులకు ప్రాణాంతకంగా మారింది. ఇటీవల పాజిటీవ్‌ నిర్ధారణ కేసుల్లో వృద్ధులే అధికంగా ఉన్నారని చెప్పిన అధికారులు, మొన్నటికీ మొన్న యువతకు కూడా వైరస్‌ సోకుతుందని తేల్చారు. తాజాగా వైరస్‌ చిన్నారులకు సోకుతుందని తేలడంతో వైద్యవర్గాలు విస్తుపోతున్నాయి. నగరంలోనే కాకుండా జిల్లాల్లో కూడా కరోనా వైరస్‌ చిన్నారులకు సైతం సోకుతుందని తేలింది.  దీంతో అప్రమత్తమైన అధికారులు, వైద్యులు వారికీ ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 6వ అంతస్తులో దాదాపు 20మంది చిన్నారులకు ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 23 రోజుల పసికందుతో పాటు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. కరోనా వైరస్‌ సోకినా చిన్నారుల్లో 12ఏళ్ల‌ ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.