క‌రోనా అల‌ర్ట్ః గ‌ర్భిణీల‌కు సూచ‌న‌లు

గ‌ర్భిణుల‌కు కోవిడ్‌-19 వైర‌స్ ఉంటే గ‌నుక అది క‌డుపులోని బిడ్డ‌కు ఏ ద‌శ‌లో ఉన్న‌ప్పుడు సోకుతుంద‌నేది

క‌రోనా అల‌ర్ట్ః గ‌ర్భిణీల‌కు సూచ‌న‌లు
Follow us

|

Updated on: Apr 30, 2020 | 4:33 PM

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. చిన్నాపెద్ద అనే తేడాలేకుండా అంద‌రినీ వెంటాడుతోంది. చివ‌ర‌కు వృద్దులు, ప‌సిపిల్ల‌లు కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు గ‌ర్భిణీలు కూడా వైర‌స్ బారిన ప‌డిన‌ట్లుగా ప‌లు కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే, వారిలో చాలా మంది సుర‌క్షితంగా డెలీవ‌రి కావ‌టం,  పుట్టిన బిడ్డ‌లు కూడా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ గ‌ర్భిణీలు వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌జారోగ్య సంక్షేమ శాఖ గ‌ర్భిణుల కోసం ప‌లు సూచ‌న‌లు చేసింది.

కరోనా వైరస్ దగ్గు, తుమ్ముల ద్వారా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఎవరైనా మీ దగ్గర్లో దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు వారి నుంచి దూరంగా వెళ్లండి. అదే విధంగా, మీరు దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కర్చీఫ్‌ని అడ్డుపెట్టుకోండి. ముఖ్యంగా మాస్క్ ధరించాల‌ని సూచిస్తున్నారు. గ‌ర్భిణుల‌కు కోవిడ్‌-19 వైర‌స్ ఉంటే గ‌నుక అది క‌డుపులోని బిడ్డ‌కు ఏ స్థాయిలో ఉన్న‌ప్పుడు సోకుతుంద‌నేది ఇంకా నిర్ధార‌ణ కాలేద‌ని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ గ‌ర్భిణీలు మాత్రం త‌మ సాధార‌ణ మందుల‌ను వాడుతూ..క‌రోనా వైర‌స్ నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవాల్సి ఉంటుంది…ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ..స‌రైన పౌష్టికాహారం తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

* ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ‌ర్‌, లేదా స‌బ్బుతో  చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి. ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి త‌ప్ప‌క హ్యాండ్ వాష్ చేసుకోవాలి.

* జ‌న‌స‌మూమాల‌కు దూరంగా ఉండాలి. ఇంట్లోనూ సామాజిక దూరం పాటించాలి.

* క‌ళ్లు, ముక్కు, నోటికి  వీలైనంత వ‌ర‌కు చేతితో ఎక్కువ‌గా తాక‌కుండా ఉండాలి

* తుమ్మిన‌ప్పుడు, ద‌గ్గిన‌ప్పుడు గానీ, మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. లేదా టిష్యూని వాడుతూ..వెంటేనే వాటిని బ‌య‌ట‌పార‌వేయాలి.

*  జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటి ల‌క్ష‌ణాలు ఏవైనా ఉంటే, వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. దానికంటే ముందు డాక్ట‌ర్ కి ఫోన్ చేసి స‌మాచారం ఇవ్వాలి. వారు చెప్పిన సూచ‌న‌లు అనుస‌రిస్తూ ఆస్ప‌త్రికి వెళ్లాల్సి ఉంటుంది.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..