కరోనా కాలం…ఆన్ లైన్ లో ఫుడ్, ఐటమ్స్ ఆర్డర్ చేసినప్పుడు…

ఢిల్లీలో కరోనా పాజిటివ్ సోకినా డెలివరీ బాయ్ కారణంగా సుమారు 72 ఇళ్ల లోనివారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. మాలవీయ నగర్ లోని ఓ ఫేమస్ పిజ్జా షాపులో పని చేసే ఈ బాయ్ రోజూ పిజ్జాలతో బాటు బాక్స్ మీల్స్, ఇతర ఐటమ్స్ కూడా డెలివరీ చేస్తుంటాడు. ఇతనికి కాంటాక్టులో ఉన్నట్టు భావిస్తున్న దాదాపు 17 మంది ఇతర డెలివరీ ఏజంట్లను కూడా క్వారంటైన్ కి తరలించారు. ఈ ఘటన.. […]

కరోనా కాలం...ఆన్ లైన్ లో ఫుడ్, ఐటమ్స్ ఆర్డర్ చేసినప్పుడు...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 3:42 PM

ఢిల్లీలో కరోనా పాజిటివ్ సోకినా డెలివరీ బాయ్ కారణంగా సుమారు 72 ఇళ్ల లోనివారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. మాలవీయ నగర్ లోని ఓ ఫేమస్ పిజ్జా షాపులో పని చేసే ఈ బాయ్ రోజూ పిజ్జాలతో బాటు బాక్స్ మీల్స్, ఇతర ఐటమ్స్ కూడా డెలివరీ చేస్తుంటాడు. ఇతనికి కాంటాక్టులో ఉన్నట్టు భావిస్తున్న దాదాపు 17 మంది ఇతర డెలివరీ ఏజంట్లను కూడా క్వారంటైన్ కి తరలించారు. ఈ ఘటన.. ఈ కరోనా కాలంలో ఆన్ లైన్ లో ఏవైనా ఆర్డర్ చేసినప్పుడు.. అవి అందాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఈ జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..

ఆన్ లైన్ లోనే పేమెంట్ జరపాలి.. డెలివరీ బాయ్ కి ఎలాంటి నగదూ చెల్లించరాదు.

తెచ్చిన వస్తువులను ఇంటి బయట.. లేదా సొసైటీ బయటే ఉంచాలని కోరాలి. ఆ బాయ్ కి కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండాలి.

బాయ్ తీసుకొచ్చిన పాకెట్స్ ని శానిటైజ్ చేయాలి.

తెప్పించిన ఫుడ్ ని తప్పనిసరిగా వేడి చేయాలి.

కూరగాయలను కూడా శుభ్రంగా కడగాలి.

బయట నుంచి తెఛ్చిన పాకెట్ ని ఇంటిలో ఉంచరాదు..