కరోనా కాటు: మహిళా ఎమ్మెల్యే మృతి

కోవిడ్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా బారినపడి ఓ మహిళా ఎమ్మెల్యే మరణించారు.

కరోనా కాటు: మహిళా ఎమ్మెల్యే మృతి
Follow us

|

Updated on: May 21, 2020 | 1:24 PM

కరోనా మహమ్మారి విజ‌ృంభణ కొనసాగుతోంది. యావత్ ప్రపంచ దేశాలను వైరస్ గడగడలాడిస్తోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తోంది. కోవిడ్ ధాటికి తట్టుకోలేక ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా బారినపడి ఓ మహిళా ఎమ్మెల్యే మరణించారు. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షహీన్ రజా ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డారు. 60 ఏళ్ల రజా..బీపీ, షుగర్‌ బాధితురాలు. కాగా, ఈ నెల 17న ఆమెకు కరోనా  వైరస్ నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి యాస్మిన్ రషీద్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. రజా పంజాబ్ నుంచి అసెంబ్లీకి రిజర్వుడు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె కరోనా నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని క్వారంటైన్ కేంద్రాలను సందర్శించారు. ఈ క్రమంలో వారి నుంచి ఆమెకు వైరస్ సోకి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను మాయో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కాగా ఆ దేశంలో ఇప్పటి వరకు 45,898 మంది కరోనా బారినపడగా, 985 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు.