పాకిస్థాన్‌లో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. అయినప్పటికీ ఆ సాహసం ఎందుకో..?

పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. మొన్నటి వరకు కేసుల సంఖ్య పదివేలకు లోపే ఉండగా.. అకస్మాత్తుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పాక్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 25,837కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 35 మంది […]

పాకిస్థాన్‌లో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. అయినప్పటికీ ఆ సాహసం ఎందుకో..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 08, 2020 | 4:31 PM

పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. మొన్నటి వరకు కేసుల సంఖ్య పదివేలకు లోపే ఉండగా.. అకస్మాత్తుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పాక్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 25,837కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 35 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 594కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 7,530 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసులు పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్‌లలోనే నమోదవుతున్నాయి. కేసులు ఇంతలా పెరుగుతున్నప్పటికీ.. మరోవైపు పాక్ ప్రభుత్వం శనివారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.