కరోనాతో ముప్పు.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం..!

కరోనా సోకితే లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కరోనాతో ముప్పు.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం..!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 5:39 PM

యువతలో కరోనా సోకితే లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓ చిన్న పరిశోధనతో ఈ విషయంను గమనించినట్లు థామస్ జెఫర్స్‌న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ”కరోనా సోకిన 30, 40, 50 ఏళ్ల వయస్సు వారిలో భారీ స్ట్రోక్స్ గమనించాం. సాధారణంగా ఇలాంటివి 70, 80ఏళ్ల వయస్సులో చూస్తుంటాం. కరోనా సోకిన 14 మందిలో స్ట్రోక్స్ లక్షణాలు పరిశీలించాం. ఇది ప్రాథమిక అధ్యయనమే అయినప్పటి ఫలితాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి” అని పాస్కల్ జాబర్ అనే శాస్త్రవేత్త అన్నారు.

స్ట్రోక్స్ లక్షణాలు కనిపించిన కొంతమంది తమ వద్దకు వచ్చారని., అందులో సగం మందికి కరోనా వైరస్ తమకు సోకినట్లు తెలీదని జాబర్ వెల్లడించారు. మానవ కణాల్లోని ఏస్‌ 2 ప్రొటీన్‌ను అంటుకొని శరీరంలోకి ప్రవేశించే కరోనా వైరస్.. ఏస్‌ 2 రెసిప్టార్‌ సాధారణ విధులను అడ్డుకుంటుందేమోనని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన మెదడుకు రక్త సరఫరా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని.. దాంతో బ్రెయిన్ స్ట్రోక్‌ ముప్పు ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నట్లు వివరించారుజ

Read This Story Also: ప్రార్థనా మందిరాల్లో ఇకపై ఇవి ఉండవు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!