Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: నేడు సీఎం జగన్ ను కలవనున్న హై పవర్ కమిటీ . ఏల్జి పాలిమర్స్ ఘటనపై నివేదిక సమర్పించనున్న హై పవర్ కమిటీ. గ్యాస్ లీక్ తర్వాత అనేక అంశాల పై అధ్యయనం చేసిన హై పవర్ కమిటీ.
  • ఈరోజు తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. రుతుపవనాల కు తోడైన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం. 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్. రాజారావు
  • కాకినాడ: కరోన పరీక్షల్లో నిర్లక్ష్యం. కరోనా వైద్య పరీక్షలు విషయంలో బట్టబయలు అవుతున్న సిబ్బంది నిర్లక్ష్యం. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అంటూ సమాచారం ఇస్తున్న సిబ్బంది. కరోనా ల్యాబ్ నుండి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను నెగెటివ్ గా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్న సిబ్బంది. రెండు రోజుల క్రితం కాకినాడ నగరంలో జగన్నాయక్ పూర్ లో ఒక యువకుడికి కరోనా పాజిటివ్. మీకు కరోనా పాజిటివ్ వచ్చిదంటూ ఆదే మధ్యాహ్నం సమాచారం ఇచ్చిన పోలీసులు. లేదు నెగిటివ్ వచ్చిందంటూ చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.
  • శ్రీకాకుళం జిల్లా : ఇచ్చాపురంలో 14 రోజులు లాక్ డౌన్ - జిల్లా కలెక్టర్ జె నివాస్. తాగునీరు, పాలు, నిత్యావసర సరుకులు, మందులు మినహా అన్ని దుకాణాలు మూసివేత. కాంటైన్మెంట్ జోన్ లో ఏ దుకాణానికి అనుమతి లేదు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతి. ఇచ్చాపురంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిర్ణయం. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. మాస్కులు ధరించాలి. వ్యక్తుల మధ్య దూరం పాటించాలి. చేతులను తరచూ సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 144వ సెక్షన్ అమలు. ఎక్కడా ప్రజలు గుమిగూడరాదు. ప్రజలు సహకరించాలి.
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం. వచ్చేవారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా సులభతర పరిపాలన. ప్రతీశాఖకు ఒక నోడల్ అధికారి, సాంకేతిక సహాయకుడు. రేపటిలోగా ఉద్యోగుల మాస్టర్ డేటా. ముద్ర సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటల్ సంతకాల సేకరణ. ఈ ఆఫీస్ పై ఉద్యోగులకు త్వరలో శిక్షణ. ఈ ఆఫీస్ కోసం అధికారుల హైరార్కీ మ్యాపింగ్.

కరోనా షాకింగ్: లక్షణాలు లేకపోయినా..యువతలో వైరస్ స్ట్రోక్

కరోనా వైరస్ ఎలా ఎటాక్ చేస్తుందో..? ఎక్కడ నుంచి వచ్చి ఎలా అంటుకుంటుందో.. తెలియని పరిస్థితి.. ఇక, వైరస్ బారినపడినా కొందరిలో లక్షణాలు కనిపించడంలేదు. కానీ, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలుతోంది. అయితే, దీనిపై వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు...
COVID-19 linked to stroke risk in healthy young people: Study, కరోనా షాకింగ్: లక్షణాలు లేకపోయినా..యువతలో వైరస్ స్ట్రోక్

కరోనా వైరస్ ఎలా ఎటాక్ చేస్తుందో..? ఎక్కడ నుంచి వచ్చి ఎలా అంటుకుంటుందో.. తెలియని పరిస్థితి.. ఇక, వైరస్ బారినపడినా కొందరిలో లక్షణాలు కనిపించడంలేదు. కానీ, టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలుతోంది. అయితే, దీనిపై వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆరోగ్యంగా ఉన్న యువతకు కోవిడ్ లక్షణాలు కనిపించకపోయినా..బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముప్పు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మార్చి 20 నుంచి ఏప్రిల్ 10 మధ్య తాము చేసిన పరిశోధనతో ఈ విషయం గమనించామని థామస్ జెఫర్సన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. తాము చూసిన స్ట్రోక్స్ ఎప్పటిలా సాధారణంగా లేవని న్యూరో సర్జరీ జర్నల్‌లో ప్రచురించారు. 30,40,50 ఏళ్ల వయసు కరోనా బాధితుల్లో భారీ స్ట్రోక్స్ గమనించామంటున్నారు. సైంటిస్టులు. సాధారణంగా ఇలాంటి స్ట్రోక్స్ 70,80 ఏళ్ల వయసు వారిలో వస్తుంటాయని అంటున్నారు. కరోనా సోకిన 14 మందిలో స్ట్రోక్స్ లక్షణాలను పరిశీలిస్తే.. ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయని, శాంపిల్స్ సైజ్ చిన్నదే అయినా..రిజల్ట్స్ దారుణంగా ఉన్నాయని చెప్పారు.

Related Tags