కరీంనగర్ వాసులకు ముఖ్య గమనిక…

తెలంగాణలోని కరీంనగర్, రామగుండం ప్రాంతాలలో పర్యటించిన ఇండినేసియన్లకు కరోనా వైరస్ సోకడంతో..జిల్లాలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదని, కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో గురువారం 25వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశామని, ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదని వెల్లడించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావొద్దని కోరారు. […]

కరీంనగర్ వాసులకు ముఖ్య గమనిక...
Follow us

|

Updated on: Mar 19, 2020 | 10:23 PM

తెలంగాణలోని కరీంనగర్, రామగుండం ప్రాంతాలలో పర్యటించిన ఇండినేసియన్లకు కరోనా వైరస్ సోకడంతో..జిల్లాలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదని, కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో గురువారం 25వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశామని, ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదని వెల్లడించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావొద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని, ఎమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ప్రభుత్వమే ప్రకటన చేస్తుందని వెల్లడించారు. 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.