ఏంజెలీనా జోలీ డూప్.. సహర్ తాబర్‌కి కరోనా పాజిటివ్..

జైలు పాలైన ఇన్‌స్టాగ్రామ్ స్టార్, ఇరాన్ టీవీ నటి సహర్ తాబర్‌కి కరోనా సోకినట్లు సమాచారం. ఇరాన్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ తాబర్‌కి జైల్లో ఉండగా కరోనా సోకినట్లు ఆమె తరపు లాయర్ తెలిపారు. నిజానికి ఈమె పేరు ఫాతెమే ఖిష్వంద్ కానీ సహర్‌ తాబర్‌గా ఫేమస్ అయ్యింది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా కనిపించే..

ఏంజెలీనా జోలీ డూప్.. సహర్ తాబర్‌కి కరోనా పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 2:28 PM

జైలు పాలైన ఇన్‌స్టాగ్రామ్ స్టార్, ఇరాన్ టీవీ నటి సహర్ తాబర్‌కి కరోనా సోకినట్లు సమాచారం. ఇరాన్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ తాబర్‌కి జైల్లో ఉండగా కరోనా సోకినట్లు ఆమె తరపు లాయర్ తెలిపారు. నిజానికి ఈమె పేరు ఫాతెమే ఖిష్వంద్.. కానీ సహర్‌ తాబర్‌గా ఫేమస్ అయ్యింది. హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీలా కనిపించే ఫొటోలను ఓ సారి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఈమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది.

అయితే ఈమె ఏంజెలీనా జోలీలా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది. కానీ మొదట ఆమె అందంగానే ఉన్నా.. మెల్లమెల్లగా ఆమె ముఖంలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో ఆమెను 2019లో పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా మంది ఆమె ఏంజెలీనా జోలీ జాంబీ అంటే దెయ్యంలా ఉందని విమర్శలు చేసేవారు. ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేసుకున్నావని తిట్టిపోశారు. అయితే తాజాగా ఆమెకు కరోనా సోకిందని లాయర్ చెబుతున్నా.. జైలు అధికారులు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు.

సహర్‌కి తగిన ట్రీట్‌మెంట్ అందించాలంటూ.. ఆమె తరపు లాయర్ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సహర్ తాబర్ జైల్లోనే క్వారంటైన్ అయినట్లు చెప్పారు. అయితే పోలీసులు మాత్రం సహర్ మైనర్‌గా ఉన్నప్పుడు తప్పులు చేసినందుకు ఇరాన్ చట్టాల ప్రకారం రిలీజ్ చేయడం కుదరదని చెబుతున్నారు.

Read More: 

కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్