పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు సోకిన క‌రోనా..!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తౌఫీక్ ఉమర్ కు కరోనా సోకింది. ఒకానొక స‌మ‌యంలో వన్డే, టెస్ట్ క్రికెట్‌లో కీలక ప్లేయ‌ర్ గా కొనసాగిన ఈ పాక్ బ్యాట్స్‌మన్‌కు కోవిడ్-19 సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింద‌ని.. ఆ దేశ స్పోర్ట్స్ చానెల్.. క్రికెట్ పాకిస్థాన్ వెల్లడించింది. దీంతో అత‌డు త‌న‌ నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్మెంట్ తీస‌కుంటున్నాడ‌ని వివ‌రించింది. 2001లో బంగ్లాదేశ్‌ టెస్ట్ మ్యాచ్‌తో ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఉమర్… తొలి మ్యాచ్‌లోనే 163 బంతుల్లో 104 […]

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు సోకిన క‌రోనా..!
Follow us

|

Updated on: May 24, 2020 | 1:39 PM

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తౌఫీక్ ఉమర్ కు కరోనా సోకింది. ఒకానొక స‌మ‌యంలో వన్డే, టెస్ట్ క్రికెట్‌లో కీలక ప్లేయ‌ర్ గా కొనసాగిన ఈ పాక్ బ్యాట్స్‌మన్‌కు కోవిడ్-19 సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింద‌ని.. ఆ దేశ స్పోర్ట్స్ చానెల్.. క్రికెట్ పాకిస్థాన్ వెల్లడించింది. దీంతో అత‌డు త‌న‌ నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్మెంట్ తీస‌కుంటున్నాడ‌ని వివ‌రించింది.

2001లో బంగ్లాదేశ్‌ టెస్ట్ మ్యాచ్‌తో ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఉమర్… తొలి మ్యాచ్‌లోనే 163 బంతుల్లో 104 ర‌న్స్ తో తనేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. దీంతో ఆ మ్యాచ్‌లో పాక్ ఇన్నింగ్స్, 264 పరుగుల భారీ తేడాతో ఘ‌న‌విజ‌యం న‌మోదు చేసింది. ఇమ్రాన్ నజీర్, సల్మాన్ బట్‌లతో అద్భుత ఓపెనింగ్ పార్ట‌నర్షిప్స్ నెలకొల్పిన ఈ లెఫ్టాండర్ బ్యాట్స్‌మన్‌.. ఫిట్‌నెస్ సమస్యల కార‌ణంగా జట్టుకు దూరమయ్యాడు. 2014లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు.

మొత్తం మీద‌ 44 టెస్ట్‌లు, 22 వన్డేల్లో పాక్ త‌రుపున బ‌రిలోకి దిగిన‌ తౌఫీక్ ఉమర్.. టెస్ట్‌ల్లో 7 సెంచరీలు, 14 అర్ధ సెంచ‌రీల‌తో 2963 రన్స్ చేశాడు. వన్డేల్లో మాత్రం 504 ప‌రుగులే చేశాడు. కెరీర్ మొత్తం జ‌ట్టులోకి వస్తూ, వెళ్తూ నిల‌క‌డ‌లేమితో గ‌డిపిన‌ తౌఫిక్.. 2016లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం కొనసాగాడు. తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను 2018 అక్టోబర్‌లో ఆడి అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కాగా ప్రాముఖ్య‌త క‌లిగిన‌ క్రికెటర్లలో తౌఫిక్ ఉమరే కరోనా సోకిన తొలి వ్యక్తి.