త్వరలో మార్కెట్ లోకి దివీస్ కరోనా మందులు..!

మానవాళి మనుగడకే సవాలు విసురుతూ.. ప్రపంచమంతటా మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే ఔషధం తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధనలు మమ్మురం చేశాయి.

త్వరలో మార్కెట్ లోకి దివీస్ కరోనా మందులు..!
Follow us

|

Updated on: Sep 15, 2020 | 2:09 PM

మానవాళి మనుగడకే సవాలు విసురుతూ.. ప్రపంచమంతటా మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే ఔషధం తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధనలు మమ్మురం చేశాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనలకు తగిన సహకారం అందించేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ కూడా ముందుకొచ్చింది. ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చిన కొన్ని డ్రగ్స్‌ సాయంతో ఔషధం తయారీకి ప్రయత్నిస్తున్నామని దివీస్‌ లేబొరేటరీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళి కె.దివి తెలిపారు.

కరోనా డ్రగ్స్ తయారీలో దివీస్ కీలకమైన ప్రగతి సాధించింది. బల్క్‌ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ కరోనా బాధితులకు చికిత్సలో వినియోగిస్తున్న ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాల తయారీ విధానాలను అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఆవిష్కరించిన ప్రాసెస్‌ల ప్రకారం ఈ ఔషధాల తయారీకి ముడిపదార్ధాలను దిగుమతి అవసరం లేకుండానే స్వతంత్ర ముడిపదార్ధాలతోనే ఈ మందులు తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అనువైన తయారీ విధానాలను ఆవిష్కరించినట్లు దివీస్‌ ఎండీ మురళి కె.దివి సోమవారం కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. మార్కెట్లో ఈ ఔషధాలకు ఉన్న డిమాండ్‌ ప్రకారం వెంటనే వీటిని తయారు చేసి, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం కోవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న వారికి త్వరగా ఉపశమనం కలిగించటం కోసం ఫావిపిరవిర్‌ ఔషధాన్ని వైద్యులు సిఫార్సు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని కొవిడ్‌-19 వ్యాధి మరీ విస్తరించి న్యూమోనియాగా మారి ఆస్పత్రుల పాలైన రోగులకు అందిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ ఔషధానికి సంబంధించి అత్యంత సంక్లిష్టమైన నాలుగు ‘ఇంటర్మీడియేట్స్‌’ తయారీకి అనువైన ‘ప్రాసెస్‌’ లను ఆవిష్కరించినట్లు మురళి కె.దివి తెలిపారు. ఈ మందులే కాకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధం తయారీ విధానాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌, విశాఖ జిల్లా చిప్పాడ వద్ద గల తమ యూనిట్లలో చేపట్టిన విస్తరణ కొంత మేరకు పూర్తయినట్లు, ఈ కొత్త యూనిట్లలో తయారీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. నమూనా మెడిసిన్స్ తయారు చేసి అనుమతులు కోసం పంపినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి పర్మిషన్ లభించిన వెంటనే పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని మురళీ కె,దివీ తెలిపారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!