కరోనా వైరస్ కేసులతో వణకుతున్న ఢిల్లీ.. రోగులకు పల్స్ ఆక్సీమీటర్లు ఇస్తామన్న సీఎం కేజ్రీవాల్

కరోనా వైరస్ కేసుల్లో ఢిల్లీ నగరం తమిళనాడును మించిపోయింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో తీవ్రమైన వైరస్ ధాటికి గురైన రెండో నగరమైంది. సోమవారం ఈ నగరంలో 62,655 కరోనా వైరస్ కేసులు..

కరోనా వైరస్ కేసులతో వణకుతున్న ఢిల్లీ.. రోగులకు పల్స్ ఆక్సీమీటర్లు ఇస్తామన్న సీఎం కేజ్రీవాల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 23, 2020 | 12:07 PM

కరోనా వైరస్ కేసుల్లో ఢిల్లీ నగరం తమిళనాడును మించిపోయింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో తీవ్రమైన వైరస్ ధాటికి గురైన రెండో నగరమైంది. సోమవారం ఈ నగరంలో 62,655 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. (తమిళనాడులో 62,087 కేసులున్నాయి). ఇక మహారాష్ట్ర 1,35,796 కేసులతో దేశంలోనే టాప్ రాష్ట్రమైంది. ఢిల్లీలో  కరోనా మరణాల సంఖ్య 2,233 కి చేరినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఇలా కేసులు పెరిగిపోతుండడంతో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్.. స్వీయ నియంత్రణలో ఉన్న కరోనా రోగులకు వారి రక్తంలోని ఆక్సిజన్ ని కొలిచే ‘పల్స్ ఆక్సీమీటర్లను’ అందజేస్తామని ప్రకటించారు. రోగులు పూర్తిగా కోలుకున్న అనంతరం వీటిని మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించవలసిఉంటుందన్నారు.  సిటీలో కరోనా వైరస్ టెస్టులను మూడు రెట్లు పెంచుతామని కూడా ఆయన చెప్పారు. జూన్ 15-22 మధ్య కాలంలో ఈ నగరంలో 21,473 కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే కాలంలో 20,379 మంది రోగులు కోలుకున్నారు. గత మూడు రోజులుగా హస్తినలో ప్రతి రోజూ సుమారు మూడు వేలకు పైగా కరోనా కేసులు రిజిస్టరవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,909 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.