Covid 19: భారత్‌లో 73కు చేరిన కరోనా కేసులు.. కేరళలో అత్యధికం!

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. దేశంలో ప్రస్తుతం కోవిద్ కేసుల సంఖ్య 73కి చేరుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం మరో 13 కేసులు

Covid 19: భారత్‌లో 73కు చేరిన కరోనా కేసులు.. కేరళలో అత్యధికం!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 5:04 PM

Covid 19: కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. దేశంలో ప్రస్తుతం కోవిద్ కేసుల సంఖ్య 73కి చేరుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం మరో 13 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో తొమ్మిది మహారాష్ట్ర, ఢిల్లీ, లడఖ్, యూపీలో ఒక్కొక్కటి నమోదయినట్టు తెలిపింది. వీరిలో 56 మంది భారతీయులు, 17 మంది విదేశీయులు ఉన్నారని ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పార్లమెంట్‌కు గురువారం తెలిపారు.

కాగా.. దేశంలో ఇప్పటివరకు మొత్తం 10.57 లక్షల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించామని తెలియజేశారు. అసాధారణ పరిస్థితులకు అసాధారణ ప్రతిస్పందన అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, ఇది సురక్షితం కాదని అన్నారు.

అయితే.. గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వీటిలో కేరళలోనే అత్యధికంగా 17 వరకు కేసులు నమోదయ్యాయి. తాజాగా ముంబయిలో తొలిసారిగా రెండు కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 11కి చేరింది. పుణెలో ఎనిమిది, ముంబయిలో ఇద్దరు, నాగ్‌పూర్‌లో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది.

[svt-event date=”12/03/2020,5:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]