Covid-19: చైనాలో కరోనా నిర్బంధంలో 76 కోట్ల మంది.. మృతులు 1770..!

Covid-19: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. చైనాలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మృతుల సంఖ్య 1770కు చేరింది. తాజాగా ఆదివారం మరో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 100 మంది వైరస్ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం. కొత్తగా మరో 2,048 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఇప్పటి వరకు 10,844 మందిని వైరస్‌ […]

Covid-19: చైనాలో కరోనా నిర్బంధంలో 76 కోట్ల మంది.. మృతులు 1770..!
Follow us

| Edited By:

Updated on: Feb 17, 2020 | 3:32 PM

Covid-19: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. చైనాలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మృతుల సంఖ్య 1770కు చేరింది. తాజాగా ఆదివారం మరో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 100 మంది వైరస్ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం. కొత్తగా మరో 2,048 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఇప్పటి వరకు 10,844 మందిని వైరస్‌ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇక హాంకాంగ్‌లో వైరస్‌ సోకిన వారి సంఖ్య 57కు చేరింది. ఇప్పటికే అక్కడ ఒకరు మరణించారు.

కోవిడ్‌-19 (కరోనా వైరస్) పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే నగరాలు, పట్టణాలన్నీ గతకొన్ని రోజులుగా నిర్మానుష్యంగా మారాయి. జనసంచారంపై ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను కఠినతరం చేస్తోంది. తొలుత కొవిడ్‌-19(కరోనా వైరస్‌)కి కేంద్రంగా ఉన్న వుహాన్‌ నగరానికే పరిమితైమన ఈ ఆంక్షలు క్రమంగా దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నాయి. దాదాపు 76 కోట్ల మంది నిర్బంధం పరిధిలోకి వచ్చారు. ఇది ఆ దేశ జనాభాల్లో సగం. ప్రపంచ జనాభాలో పదిశాతం. వీరిలో కొంతమంది పూర్తి స్థాయి ఆంక్షల పరిధిలోకి వస్తే మరికొంత మంది పాక్షిక నిర్బంధంలో కొనసాగుతున్నారు.

కరోనా కేసులు ఇప్పటికే 25 దేశాలకు విస్తరించాయి. మరోవైపు చైనా, హాంకాంగ్‌లో ఆంక్షలతో ప్రజల నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్నారు. హాంకాంగ్‌లో ఆదివారం ఆయుధాలతో వచ్చి మరీ కొంతమంది దుకాణాల్లో టాయిలెట్ పేపర్లు, డైపర్లు, వంట సామగ్రి దొంగిలించారు. ఈ ఘటన అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా మాస్కుల తయారీ ఊపందుకున్నప్పటికీ.. డిమాండ్‌కు సరిపడా అందట్లేదని తెలుస్తోంది. వుహాన్‌ సమీపంలో ఉన్న ఓ కంపెనీ ఇటీవల మాస్క్‌ తయారీ యంత్రాల్ని ప్రత్యేకంగా తయారు చేసింది. ఒక్కోయంత్రం రోజుకు 40 వేల నుంచి 50 వేల మాస్క్‌లు ఉత్పత్తి చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫిబ్రవరి 27 నాటికి మరో 10 యంత్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.