Covid 19: చైనాలో 92% క్షీణించిన కార్ల అమ్మకాలు

Covid 19: చైనాలో 2వేలకు పైగా ప్రజలను బలిగొన్న కోవిడ్‌-19 (కరోనా వైరస్) మరో 26 దేశాల్లో విజృంభిస్తోన్న సంగతి విదితమే. కరోనావైరస్ దెబ్బకు పారిశ్రామిక రంగం విలవిల్లాడుతోంది. ప్రపంచ వృద్ధిరేటే 1శాతం కుంగవచ్చని నివేదికలు ఘోషిస్తున్నాయి. ఆ ప్రభావం ఆటోమొబైల్‌ రంగంపై కూడా పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌ అయిన చైనాలో కార్ల విక్రయాలు భారీగా పతనమయ్యాయి. కేవలం నామమాత్రంగానే విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా చైనా ప్యాసింజర్‌ కార్స్‌ అసోసియేషన్‌(సీపీసీఏ) ఫిబ్రవరి తొలి 16 […]

Covid 19: చైనాలో 92% క్షీణించిన కార్ల అమ్మకాలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 5:57 PM

Covid 19: చైనాలో 2వేలకు పైగా ప్రజలను బలిగొన్న కోవిడ్‌-19 (కరోనా వైరస్) మరో 26 దేశాల్లో విజృంభిస్తోన్న సంగతి విదితమే. కరోనావైరస్ దెబ్బకు పారిశ్రామిక రంగం విలవిల్లాడుతోంది. ప్రపంచ వృద్ధిరేటే 1శాతం కుంగవచ్చని నివేదికలు ఘోషిస్తున్నాయి. ఆ ప్రభావం ఆటోమొబైల్‌ రంగంపై కూడా పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌ అయిన చైనాలో కార్ల విక్రయాలు భారీగా పతనమయ్యాయి. కేవలం నామమాత్రంగానే విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా చైనా ప్యాసింజర్‌ కార్స్‌ అసోసియేషన్‌(సీపీసీఏ) ఫిబ్రవరి తొలి 16 రోజుల్లో జరిగిన విక్రయాలపై నివేదిక ఇచ్చింది.

చైనా ప్యాసింజర్‌ కార్స్‌ అసోసియేషన్‌(సీపీసీఏ) అంచనాల మేరకు ఫిబ్రవరి 16వ తేదీ వరకు అక్కడ ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 92శాతం పతనమయ్యాయి. గతేడాది ఇదే సీజన్‌లో 59,930 కార్లు అమ్ముడుపోతే ఇప్పుడు 4,909 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అతి తక్కువ డీలర్లు మాత్రమే షోరూమ్‌లను తెరిచినట్లు ఈ నివేదికలో వెల్లడించారు. వారి వద్ద కూడా కస్టమర్లు తక్కువగానే ఉన్నారని పేర్కొంది. చైనా మార్కెట్లో ఏటా 25 మిలియన్ల వాహనాలను విక్రయిస్తారు.

కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో చైనాలో వాహనా తయారీ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయి.చైనాలో నెలకొన్న మందగమనంతో భారత్‌పై పెను ప్రభావం పడనుందని ఫిచ్‌ ఇటీవల పేర్కొంది. దీంతో తయారీ దారులు సైతం వాహనాల ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంటుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కారణాలతో 2020లో 8.3 శాతం మేర వాహనాల ఉత్పత్తి తగ్గేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తగ్గుదల 2019లో 13.2 శాతంగా ఉండడం గమనార్హం.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..