Breaking News
  • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
  • అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ ముద్దాడ రవిచంద్ర బదిలీ. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. బుడితి రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
  • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
  • అమెరికాలో జోరుగా సాగుతున్న ముందస్తు పోలింగ్‌. టెక్సాస్‌లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు. ఈనెల 13న మొదలైన ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ. ఇప్పటివరకు ఓటేసిన 70లక్షల మంది ఓటర్లు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఈ శతాబ్ధానికే పోలింగ్‌ శాతం రికార్డుగా మారుతుందన్న నిపుణులు . అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం .
  • టీవీ9 ఎఫెక్ట్‌: తూ.గో: ఈతకోట-గన్నవరం రహదారిపై గుంతల పూడ్చివేత . టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు . యుద్ధప్రాతిపదికన గోతులను పూడ్చుతున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు .
  • దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య అనారోగ్యంతో కన్నుమూత. నాయిని తో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అహల్య.. నాయిని అంతక్రియలకు వైద్యుల పర్యవేక్షణలో హాజరయిన అహల్య.

డ్రాగన్ కుయుక్తి..! కోవిడ్ వ్యాక్సిన్ షాట్స్‌పై రహస్య ఒప్పందాలు?

డ్రాగన్ కంట్రీ చైనా చేస్తున్న తాజా పన్నాగం ఒకటి బయటపడింది. క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ షాట్స్‌ను చైనా.. తమ వేలాది మంది దేశస్తులకు..

China gives ‘unproven’ vaccine to thousands, డ్రాగన్ కుయుక్తి..! కోవిడ్ వ్యాక్సిన్ షాట్స్‌పై రహస్య ఒప్పందాలు?

China gives ‘unproven’ vaccine to thousands: డ్రాగన్ కంట్రీ చైనా చేస్తున్న తాజా పన్నాగం ఒకటి బయటపడింది. క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ షాట్స్‌ను చైనా.. తమ వేలాది మంది దేశస్తులకు ఇంజెక్ట్ చేస్తున్నట్లు ప్రపంచ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. వాటి సామర్ధ్యంపై ఇంకా స్పష్టత రాకముందే ఈ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. వాటి వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నా ఆపట్లేదని నిపుణులు అంటున్నారు. అంతేకాదు టీకా పొందినవారు తమ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండేలా.. రహస్య ఒప్పందంపై చైనా ప్రభుత్వం సంతకం చేయించిందట. వ్యాక్సిన్ పొందిన వారిలో ప్రభుత్వ అధికారులు, వ్యాక్సిన్ తయారీ కంపెనీ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. అత్యవసర ప్రాతిపదికన వారికి చైనా ప్రభుత్వం కోవిడ్ టీకాను ఇంజెక్ట్ చేసింది. దీనితో గ్లోబల్ హెల్త్ నిపుణులు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. టీకా ఇచ్చే ముందు వారి అంగీకారం తీసుకుంటున్నారా.? లేదా.? అని ప్రశ్నిస్తున్నారు.

జూలైలో చైనా ప్రయోగాత్మకంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రాంను మొదలుపెట్టింది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మద్దతు కూడా లభించిందని అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారి జెంగ్ జాంగ్‌వే వెల్లడించారు. జూన్‌లోనే డబ్ల్యూహెచ్‌ఓకు తాము సమాచారం అందించామని తెలిపారు. అలాగే ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా దేశాలు తమ అధికార పరిధిలో వైద్య ఉత్పత్తుల వాడకాన్ని ఆమోదించవచ్చునని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పిన విషయం విదితమే.

కాగా, చైనాలో ప్రస్తుతం క్లినికల్ ట్రయిల్స్ దశలో 11 కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయి. వాటిల్లో నాలుగు ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్నాయి. రెండు టీకాలను నేషనల్ బయోటెక్ గ్రూప్ అభివృద్ధి చేస్తుండగా.. ఒకదాన్ని సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది. అటు కాన్సినో బయోలాజిక్స్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకాను చైనా మిలటరీలో ఉపయోగించడానికి జూన్‌లోనే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..

ఏపీలో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!

Related Tags