పెరుగుతున్న కేసులు.. 3 లక్షలకు చేరువలో మృతులు..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ వైరస్.. దాదాపు ప్రపంచ దేశాలన్నింటిని ముట్టేసింది. కులం, మతం, ప్రాంతం, భాష, రంగు అని తేడా లేకుండా.. సామాన్య ప్రజలతో పాటు.. అగ్ర రాజ్య అధినేతలను సైతం భయపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 45 లక్షలకు చేరువలో ఉండగా.. మ‌ృతుల సంఖ్య దాదాపు మూడు లక్షలకు చేరుకుంటుంది. అయితే వీరిలో కోలుకున్న వారి సంఖ్య మాత్రం పదహారున్నర లక్షలు మాత్రమే. […]

పెరుగుతున్న కేసులు.. 3 లక్షలకు చేరువలో మృతులు..
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 12:02 PM

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ వైరస్.. దాదాపు ప్రపంచ దేశాలన్నింటిని ముట్టేసింది. కులం, మతం, ప్రాంతం, భాష, రంగు అని తేడా లేకుండా.. సామాన్య ప్రజలతో పాటు.. అగ్ర రాజ్య అధినేతలను సైతం భయపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 45 లక్షలకు చేరువలో ఉండగా.. మ‌ృతుల సంఖ్య దాదాపు మూడు లక్షలకు చేరుకుంటుంది. అయితే వీరిలో కోలుకున్న వారి సంఖ్య మాత్రం పదహారున్నర లక్షలు మాత్రమే. గురువారం ఉదయం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 మందికి కరోనా సోకగా.. వీరిలో 2.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 16.57 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 85 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక.. కరోనా కేసులు అత్యధికంగా అమెరికాలో నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్, రష్యా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు ఉన్నాయి.