భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 418 మంది మృతి..

భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,522 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

భారత్‌లో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 418 మంది మృతి..
Follow us

|

Updated on: Jun 30, 2020 | 10:43 AM

భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 18,522 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తంగా దేశంలో 5,66,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,15,125 యాక్టివ్ కేసులు ఉండగా 3,34,821 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్క రోజే 418 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 16,893కు చేరింది.

ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రాల్లోనే… 

  • మహారాష్ట్ర – 1,69,883
  • తమిళనాడు – 86,224
  • ఢిల్లీ – 85,161
  • గుజరాత్ – 31,938
  • ఉత్తరప్రదేశ్ – 22,828
  • వెస్ట్ బెంగాల్ – 17,907
  • రాజస్తాన్ – 17,660

ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా మరణాలు..

  1. మహారాష్ట్ర – 7610
  2. ఢిల్లీ – 2680
  3. గుజరాత్ – 1827
  4. తమిళనాడు – 1141
  5. ఉత్తరప్రదేశ్ – 672