ఢిల్లీలో లక్ష దాటింది..ఆందోళనలో దేశ రాజధాని

Covid-19 Cases : కరోనాతో దేశ రాజాధిని వణికిపోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత.. దేశంలో నమోదవుతున్న కేసులు ఢిల్లీలోనే నమోదవ్వడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూసి.. రాజధాని ప్రజలు వణికిపోతున్నారు. కేసుల సంఖ్య పెరగడమే కాకుండా.. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బిలిట్ ప్రకారం ఢిల్లీలో లక్ష కేసులు దాటాయి. గడిచిన […]

ఢిల్లీలో లక్ష దాటింది..ఆందోళనలో దేశ రాజధాని
Follow us

|

Updated on: Jul 06, 2020 | 7:56 PM

Covid-19 Cases : కరోనాతో దేశ రాజాధిని వణికిపోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత.. దేశంలో నమోదవుతున్న కేసులు ఢిల్లీలోనే నమోదవ్వడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూసి.. రాజధాని ప్రజలు వణికిపోతున్నారు. కేసుల సంఖ్య పెరగడమే కాకుండా.. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బిలిట్ ప్రకారం ఢిల్లీలో లక్ష కేసులు దాటాయి. గడిచిన 24 గంటల్లో 1,379 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,823కి చేరింది.

దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి ఢిల్లీ వ్యాప్తంగా3,115 మంది మరణించారు. అయితే ఇక్కడ రికవరీ రేటు బాగుండటం.. కాస్త ఊరటినిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 25,620 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 72,088 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.