గ్రేట‌ర్‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ః ఒకే ఇంట్లో 16 మందికి పాజిటివ్

ఇన్ఫెక్షన్ బారిన పడిన చాలా మందిలో లక్షణాలేవీ బహిర్గతం కాకపోతుండటంతో.. వారి నుంచి కుటుంబంలోని వేరే వాళ్లకు వైరస్ సోకుతోంది. ఓ యువకుడి ద్వారా ఆ ఇంట్లోని 16 మంది వైరస్ బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

గ్రేట‌ర్‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ః ఒకే ఇంట్లో 16 మందికి పాజిటివ్
Follow us

|

Updated on: May 18, 2020 | 12:20 PM

భాగ్య‌న‌గ‌రాన్ని క‌రోనా వెంటాడుతోంది. గ‌త వారం రోజులుగా న‌గ‌రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెల లెక్క‌ను త‌ప్ప‌కుండ న‌మోదు అవుతూనే ఉంది. ఆదివారం కొత్తగా మ‌రో 42 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 37 కేసులను గుర్తించారు. ఇన్ఫెక్షన్ బారిన పడిన చాలా మందిలో లక్షణాలేవీ బహిర్గతం కాకపోతుండటంతో.. వారి నుంచి కుటుంబంలోని వేరే వాళ్లకు వైరస్ సోకుతోంది. మంగళ్‌హాట్‌లో ఓ యువకుడి ద్వారా ఆ ఇంట్లోని 16 మంది వైరస్ బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లోని మంగళహాట్ కరోనా హాట్ స్పాట్ గా మారింది. స్థానికంగా నివసిస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అతడి కుటుంబంలోని వారందరి శాంపిల్స్ ని టెస్ట్ చేశారు అధికారులు. మొత్తం 27 మంది కుటుంబ సభ్యులు గల ఆ ఇంట్లో 16 మందికి వైరస్ పాటిజివ్ గా నిర్ధారణ అయ్యింది. వారిలో 8 మంది చిన్నారులు సహా 16 మంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఇంటి యజమాని చికిత్స పొందుతూ మరణించాడు.

మరోవైపు మణికొండ మున్సిపాలిటీలోని అలీజాపూర్ లో పాజిటివ్ కేసు వెలుగు చూసింది.. వెంట‌నే అత‌డిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి త‌ర‌లించారు.. అత‌డికి ట‌చ్ లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 14 మందిని క్వారంటైన్ కి త‌ర‌లించారు అధికారులు.. అలాగే ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి రెడ్ జోన్ గా ప్రకటించారు.