కోర్టు డ్రైవర్ కొడుకు జడ్జిగా.. ‘ లా ‘ హిస్టరీలో ట్విస్ట్ !

Driver Son Become Judge in Madhya Pradesh, కోర్టు డ్రైవర్ కొడుకు జడ్జిగా.. ‘ లా ‘ హిస్టరీలో ట్విస్ట్ !

న్యాయ చరిత్రలో ఇదో కొత్త మలుపు ! కోర్టులో డ్రైవర్ గా పని చేసే వ్యక్తి కొడుకే న్యాయమూర్తి కాబోతున్నాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కోర్టులో ఇదో సరికొత్త పరిణామం. అతని పేరు చేతన్ బజాద్.. ఈ మధ్యే సివిల్ జడ్జి క్లాస్-2 రిక్రూట్ మెంట్ కి సెలక్ట్ అయ్యాడు. దీంతో జడ్జి అయ్యే అర్హత సంపాదించాడు. ఇండోర్ కోర్టులో డ్రైవర్ గా ఉన్న గోవర్ధన్ లాల్ బజాద్ కొడుకే చేతన్ ! ఈ కోర్టుతో తన తండ్రికి ఉన్న అనుబంధం తననెంతో ప్రభావితం చేసిందని, దీంతో జుడీషియరీనే వృత్తిగా చేపట్టి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని చేతన్ చెబుతున్నాడు. రోజుకు కనీసం 12 నుంచి 13 గంటలు చదివేవాడినని, జడ్జిగా ప్రజలకు న్యాయం కల్పించేందుకు కృషి చేస్తానని అన్నాడు. సమాజానికి సేవ చేయాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నాడు. కాగా-తమ కుమారుడు న్యాయమూర్తి కాబోతుండడం పట్ల చేతన్ తలిదండ్రులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇది ఊహించని పరిణామం అంటున్నారు.

Driver Son Become Judge in Madhya Pradesh, కోర్టు డ్రైవర్ కొడుకు జడ్జిగా.. ‘ లా ‘ హిస్టరీలో ట్విస్ట్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *