Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

డెలివరీ బాయ్‌ అని ఇంట్లోకి రానిస్తే.. ఎంత పనిచేశాడో..?

డెలీవరీ బాయ్‌ ముసుగులో ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇంటిని గుల్ల చేసిన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చండీగఢ్‌లోని సెక్టార్ 57 ప్రాంతంలో ఉండే ఓ మహిళ కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. కాగా.. గత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. సడెన్‌గా డోర్ బెల్ మోగడంతో.. తలుపు తీసింది. చూస్తే కొరియర్‌ బాయ్.. ఓ పార్శిల్‌తో ప్రత్యక్ష్యమయ్యాడు. విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందని నిధికి కవర్‌ అందించాడు. అయితే.. ఆ పార్శిల్‌ను ఓపెన్ చేయని కోరి.. వాటర్ కావాలని.. లోపలికి వచ్చాడు. దీంతో.. నిధి ఆ పార్శిల్ ఓపెన్ చేసింది. అందులో ఓ తెల్లటి పదార్థం ఉంది.. దానిని వాసన చూడగానే ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. దీంతో.. డెలీవర్‌ బాయ్ తన స్నేహితులతో కలిసి ఇళ్లును గుల్ల చేసి ఉడాయించాడు. తేరుకున్న మహిళ.. పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేయగా.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.