ఘరానా దంపతుల మోసం.. బ్యాంకులకు టోకారా వేయడంలో దిట్ట.. 5 కోట్లు బురిడీ కొట్టించి అడ్డంగా దొరికిపోయారు..

బ్యాంకులను మోసం చేయడంలో ఆ దంపతులది అందెవేసిన చేయి. తప్పుడు పత్రాలను సృష్టించి కోట్ల రూపాయాలను సులువుగా దోచేస్తారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:20 pm, Thu, 19 November 20
ఘరానా దంపతుల మోసం.. బ్యాంకులకు టోకారా వేయడంలో దిట్ట.. 5 కోట్లు బురిడీ కొట్టించి అడ్డంగా దొరికిపోయారు..

బ్యాంకులను మోసం చేయడంలో ఆ దంపతులది అందెవేసిన చేయి. తప్పుడు పత్రాలను సృష్టించి కోట్ల రూపాయాలను సులువుగా దోచేస్తారు. భర్తకు భార్య, భార్యకు భర్త ఎంతో అన్యోనంగా సహకరించుకుంటారు.. మోసాలు చేయడంలో తమకు తామే సాటని నిరూపించుకుంటున్నారు. తాజాగా షాద్‌నగర్‌లోని ఇండియన్ బ్యాంకులో 5 కోట్లకు ఎగనామం పెట్టి అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదారాబాద్ షేక్‌పేటలో నివసిస్తున్న పబ్బతి ప్రభాకర్, సరితలు నాగోల్ దగ్గర ఓ రియల్ ఎస్టేట్ ఆపీసు నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో లాస్ రావడంతో మోసాలకు తెగబడ్డారు. షాద్‌నగర్ ఇండియన్ బ్యాంకులో ప్లాట్ల పేరిట తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి 5 కోట్ల రుణం పొందారు. సకాలంలో కిస్తీలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పత్రాలను పరిశీలించారు. అవి నకిలీ అని తేలడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి విల్లాకు వెళ్లి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘరానా దంపతులపై సీటిలోని పీఎస్‌లలో పలు కేసులు నమోదయ్యాయి. దివాకర్ సింగ్ అనే వ్యక్తి దగ్గర 9 ఎకరాలు లీజుకు తీసుకొని భూమి పత్రాలను తన పేర్లపై మార్చుకున్నారు. అంతేకాకుండా చాలా మంది దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని కట్టకుండా తప్పించుకుతిరుగుతున్నారు. విలాసాలకు అలవాటు పడిని ఈ జంట ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు.