హైఅలర్ట్: దేశంలోకి నలుగురు పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు?

Countrywide alert sounded after group of 4 along ISI agent enter India, హైఅలర్ట్: దేశంలోకి నలుగురు పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు?

దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజస్థాన్​లోని సిరోహి జిల్లా ఎస్పీ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఓ ఐఎస్​ఐ ఏజెంట్ సహా నలుగురు అనుమానితులు దేశంలోకి ప్రవేశించారని, ఎప్పుడైనా దాడులు జరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్​ఐకి చెందిన ఓ ఏజెంట్​ సహా మరో నలుగురు అనుమానితులు గుట్టుచప్పుడు కాకుండా దేశంలో ప్రవేశించారని సమాచారం. ఈ నేపథ్యంలో రాజస్థాన్-గుజరాత్ సహా దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్థాన్ పాస్​పోర్టులతో అనుమానస్పద వ్యక్తులు భారత్​లో ప్రవేశించారని తెలుస్తోంది. ఐఎస్ఐ ఏజెంట్ల సంచారం నేపథ్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులతోపాటు ఇతర ప్రాంతాల్లోని హోటళ్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పకడ్బందీ తనిఖీలు జరపాలని ఎస్పీ ఆదేశించారు. కొన్ని రోడ్లపై వాహనాల ఆకస్మిక తనిఖీలు చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై నిఘా వేయాలని ఎస్పీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *