ఏపీ: మండలి రద్దుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదన..

బుధవారం రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శాసనసభ నేడు చర్చించింది. దీనిపై మాట్లాడిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు మండలిని రద్దు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజా సంక్షేమానికి మండలి ఆటంకంగా మారిందని ఆక్షేపించారు. ఇక శాసనమండలి సభా నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ సైతం ఇదే వెర్షన్ చెెప్పుకొచ్చారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చోని చైర్‌ని ప్రభావితం చేశారని, ఇన్‌సైడర్ […]

ఏపీ: మండలి రద్దుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదన..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2020 | 6:29 PM

బుధవారం రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శాసనసభ నేడు చర్చించింది. దీనిపై మాట్లాడిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు మండలిని రద్దు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజా సంక్షేమానికి మండలి ఆటంకంగా మారిందని ఆక్షేపించారు. ఇక శాసనమండలి సభా నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ సైతం ఇదే వెర్షన్ చెెప్పుకొచ్చారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చోని చైర్‌ని ప్రభావితం చేశారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ గుట్టు బయటపడుతుందనే ఆయన నాటకాలాడుతున్నారని పేర్కొన్నారు. సభాపతులకు, ఛైర్మన్లకు విచక్షణాధికారాలు ఉన్నాయని, వారు కూడా పార్టీ చెప్పినట్టు నడుచుకుంటుంటే ఇక సభ ఔన్నత్యం ఎక్కడుందని ప్రశ్నించారు. రాజనీతికి కట్టుబడని ఇటువంటి మండలిలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.