Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

రిచెస్ట్ పార్టీ బిజెపి.. ఫండ్స్ ఎలా వచ్చాయంటే ?

richest party in india is bjp, రిచెస్ట్ పార్టీ బిజెపి.. ఫండ్స్ ఎలా వచ్చాయంటే ?

దేశంలోనే అత్యంత పెద్దపార్టీగా, అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు సృష్టించిన భారతీయ జనతా పార్టీ మరో విషయంలో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. సుమారు 15 కోట్లకు పైగా సాధారణ సభ్యత్వం కలిగిన ఏకైకా రాజకీయ పార్టీ దేశంలో బిజెపి ఒక్కటే. వార్డు లెవల్ వరకు పార్టీని విస్తరించిన కమలం నేతలు.. ఇంకా సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వున్నారు. 1984లో కేవలం రెండు.. సరిగ్గా రెండంటే రెండు ఎంపీ సీట్లు కలిగి వున్న పొలిటికల్ పార్టీ నేడు.. దేశంలోనే అతి పెద్ద పార్టీ.

కేంద్రంలో సింగిల్‌గా రెండు సార్లు లోక్‌సభలో సాధారణ మెజారిటీ సాధించిన తొలి పార్టీ కాంగ్రేసేతర పార్టీ కూడా భారతీయ జనతా పార్టీనే. నరేంద్ర మోదీ చరిష్మాని క్యాష్ చేసుకుంటూ పురోగమిస్తున్న బిజెపి మరో ఫీట్‌ను వరుసగా రెండో ఏడాది కూడా సాధించింది.

గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2018-19 ఏడాదికిగాను అందిన విరాళాల వివరాలను కమలం పార్టీ వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వివిధ సంస్థలు, ట్రస్టుల ద్వారా మొత్తం 700 కోట్ల రూపాయల ఫండ్స్ పార్టీకి అందినట్లు వెల్లడించారు బిజెపి నేతలు. డిజిటల్ చెల్లింపులు, చెక్కుల రూపంలోనే ఈ మొత్తం సమకూరిందని.. ఈ మొత్తమంతా వైట్ మనీనేనని బిజెపి నేతలు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్‌కు సంబంధించిన ట్రస్టు నుంచే వచ్చిందని తెలుస్తోంది. టాటాసన్స్‌కు సంబంధించిన ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్’ నుంచే బీజేపీకి 356కోట్ల రూపాయల ఫండ్స్ అందినట్లు సమాచారం. 20వేల రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో బీజేపీ వెల్లడించకపోవడం విశేషం.