యోగా, సంగీతంతో కరోనాను జయిస్తున్న బాధితులు..

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజుకూ అర లక్షకు చేరువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా, పాజిటివ్ కేసులతో పాటుగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కరోనా నుంచి ఊరటనిచ్చే గొప్ప అంశం అంటున్నారు. అంతేకాదు, కరోనా సోకిన వారు..

యోగా, సంగీతంతో కరోనాను జయిస్తున్న బాధితులు..
Jyothi Gadda

|

Jul 27, 2020 | 3:55 PM

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజుకూ అర లక్షకు చేరువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా, పాజిటివ్ కేసులతో పాటుగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కరోనా నుంచి ఊరటనిచ్చే గొప్ప అంశం అంటున్నారు. అంతేకాదు, కరోనా సోకిన వారు భయంతో కుంగిపోవద్దని సూచిస్తున్నారు. మందులేని మహమ్మారిని తగ్గించేందుకు వైద్యులు, అధికారులు అనేక రకాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ముంభైలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో రోగులకు వినూత్న ఏర్పాట్లు చేశారు.

ముంబైలో కరోనా వీరవిహారం చేస్తుండగా, బాధితులను రక్షించేందుకు వైద్య సిబ్బంది, అధికారులు వైద్యంతో పాటుగా అనేక రకాలైన విధానాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోలాపూర్‌లోని క్యాటరింగ్ కాలేజీలో ఆహ్లాద‌క‌ర‌మైన కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి కోవిడ్ కేర్ సెంటర్‌లో ప్రాణాయామం, యోగాస‌నాల‌ను నేర్పిస్తున్నారు. అలాగే అల‌రించే సంగీతాన్ని కూడా వినిపిస్తున్నారు. షోలాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ మిలింద్ శంభార్కర్ ఈ కేంద్రం ఏర్పాటుకు చొర‌వ చూపారు. గ‌త మే 27న ఈ క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా,.జూలై 20 నుంచి ఈ కేంద్రంలో ప్రాణాయామం, యోగాస‌నాల‌ను నేర్పిస్తున్నారు. అలాగే అల‌రించే సంగీతాన్ని కూడా వినిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం 178 మంది కరోనా బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. 138 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకుని డిశార్జ్ అయ్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu