తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ షాప్స్ ఓపెన్.. మందుబాబులు ఫుల్ హ్యాపీ.. సిత్ర ‘వి’చిత్రాలు..

సుమారు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీనితో మందుబాబుల ఆనందానికి అవధులు లేవు. ఉదయం మద్యం షాపు తెరవకముందే మద్యం ప్రియులు క్యూ కట్టి భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ వంతు వచ్చేవరకు వేచి చూస్తున్నారు. ఈ తరుణంలోనే కొన్ని మద్యం షాపుల ఎదుట చిత్ర ‘విచిత్రాలు’ ఆసక్తిని కలజేస్తున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరులో మందుబాబులు ఎండలకు తట్టుకోలేక చెప్పులు లైన్‌లో పెట్టి సేద తీరారు. మరోవైపు కృష్ణా […]

  • Ravi Kiran
  • Publish Date - 4:17 pm, Wed, 6 May 20
తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ షాప్స్ ఓపెన్.. మందుబాబులు ఫుల్ హ్యాపీ.. సిత్ర 'వి'చిత్రాలు..

సుమారు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీనితో మందుబాబుల ఆనందానికి అవధులు లేవు. ఉదయం మద్యం షాపు తెరవకముందే మద్యం ప్రియులు క్యూ కట్టి భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ వంతు వచ్చేవరకు వేచి చూస్తున్నారు. ఈ తరుణంలోనే కొన్ని మద్యం షాపుల ఎదుట చిత్ర ‘విచిత్రాలు’ ఆసక్తిని కలజేస్తున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరులో మందుబాబులు ఎండలకు తట్టుకోలేక చెప్పులు లైన్‌లో పెట్టి సేద తీరారు. మరోవైపు కృష్ణా జిల్లాలో మద్యం షాపుల ముందు క్యూలైన్లలో మందుబాబులు నిబంధనలు పాటిస్తేనే మద్యం ఇస్తామన్న అధికారులు చెప్పడంతో గొడుగులతో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తున్న మద్యం ప్రియులు మాస్క్‌లు ధరించి పడిగాపులు పడ్డారు. ఇలా అన్ని చోట్లా ఎన్నో సిత్రాలు చోటు చేసుకున్నాయి. మీరే చూడండి.