Corona Virus: మండుతోన్న ఎండలు కరోనాను అంతం చేస్తాయనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..

Corona Virus: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది విజృంభిస్తోన్న వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు...

Corona Virus: మండుతోన్న ఎండలు కరోనాను అంతం చేస్తాయనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..
Corona In Summer
Follow us

|

Updated on: Apr 08, 2021 | 7:33 AM

Corona Virus: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది విజృంభిస్తోన్న వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండడం భయపెట్టిస్తోంది. ఇక ఈ నెల చివరినాటికి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్‌ కూడా దాటేస్తున్నాయి. ఈ సమయంలో ఇంత ఎండలో కరోనా ఎక్కడ బతుకుందనే ఓ అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే కరోనా విషయంలో ఇదేది ఉండదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మిగతా ఫ్లూ వ్యాధుల్లా.. కోవిడ్‌19 సీజనల్‌ ప్యాటరన్‌ను ఫాలో అవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై డాక్టర్లు మాట్లాడుతూ.. ‘కోవిడ్‌19 వ్యాప్తికి వాతావరణ పరిస్థితులకు ఏలాంటి సంబంధం లేదు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నా కూడా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేయలేము. గతేడాది సెప్టెంబర్‌లో కరోనా తారా స్థాయికి చేరింది.. కానీ ఈ ఏడాది మాత్రం మార్చిలో తీవ్ర స్థాయికి చేరుకుందని డాక్టర్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఎండలు తీవ్రంగా మండిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతగా ఫీలవుతారని.. ఈ కారణంగా మాస్కులు తీయడం, పదే పదే ముఖాన్ని చేతులతో తాకుతుండడం కూడా కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కావున ప్రజలు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 59,907 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 31,73,261 కు చేరుకున్నాయి. నిన్న 322 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 56,652 కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

Also Read: corona lockdown : దేశవ్యాప్తంగా కోరలు చాస్తోన్న కోవిడ్ మహమ్మారి, సంపూర్ణ లాక్ డౌన్లు, కర్ఫ్యూలతో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

Modi video conference: ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు.. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయాలు?

తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ రెడ్ అలర్ట్, వివిధ జిల్లాల వైద్యాధికారులతో మంత్రి ఈటల కీలక భేటీ

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.