‘కంటికి కనబడని శత్రువులు జర్నలిస్టులు’…విరుచుక పడిన ట్రంప్

తన వైట్ హౌస్ లో రోజూ కరోనాపై జర్నలిస్టులకు బ్రీఫింగులు ఇచ్ఛే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాళ్ళ మీద మళ్ళీ భగ్గుమన్నారు. జర్నలిస్టులు కంటికి కనబడని శత్రువులని ఆరోపించారు. ఎంతసేపూ వాళ్ళు తనను విమర్శిస్తూనే వార్తలు రాస్తారని, తన ప్రభుత్వ విజయాల గురించి ప్రస్తావించరని విమర్శించారు. కరోనా రోగులకు బ్లీచింగ్ ఇంజెక్షన్ ఇస్తే వారిలోని వైరస్ నశిస్తుందని తాను చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా అపహాస్యం పాలు కాగ్గా నాలుక్కరుచుకుని ‘ఏదో సర్ కాస్టిక్ గా […]

'కంటికి కనబడని శత్రువులు జర్నలిస్టులు'...విరుచుక పడిన ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 28, 2020 | 3:06 PM

తన వైట్ హౌస్ లో రోజూ కరోనాపై జర్నలిస్టులకు బ్రీఫింగులు ఇచ్ఛే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాళ్ళ మీద మళ్ళీ భగ్గుమన్నారు. జర్నలిస్టులు కంటికి కనబడని శత్రువులని ఆరోపించారు. ఎంతసేపూ వాళ్ళు తనను విమర్శిస్తూనే వార్తలు రాస్తారని, తన ప్రభుత్వ విజయాల గురించి ప్రస్తావించరని విమర్శించారు. కరోనా రోగులకు బ్లీచింగ్ ఇంజెక్షన్ ఇస్తే వారిలోని వైరస్ నశిస్తుందని తాను చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా అపహాస్యం పాలు కాగ్గా నాలుక్కరుచుకుని ‘ఏదో సర్ కాస్టిక్ గా ‘ అన్నా అంతే అంటూ తప్పించుకో జూసిన ఈయన… నిన్న జర్నలిస్టుల పై అలిగి స్టేజీ పై నుంచే చక్కా వెళ్ళిపోయాడు. తాను చేసిన కామెంట్లను పెద్ద జోక్ గా వార్తా పత్రికలు రాయడాన్ని ఆయన సహించలేకపోయారు. ‘ఫేక్ న్యూస్ ! ది ఎనిమీ ఆఫ్ ది పీపుల్’ అని ట్వీట్ చేసిన ట్రంప్ మహాశయుడు.. ‘మన దేశ చరిత్రలోనే ఇంత అధ్వాన్నపు మీడియా లేదని, నేషనల్ ఎమర్జెన్సీలో సైతం వీళ్ళు కనబడని శత్రువులని’ దుయ్యబట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి తన నాయకత్వ గొప్పదనాన్ని అదే పనిగా ఊదరగొడుతుంటే ప్రెస్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ? విసుగెత్తి.. నామాత్రంగా ఆయన ప్రసంగాన్ని ఇఛ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చి ఇలా కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఈ వరస చూస్తే వైట్ హౌస్ లో ఇక ప్రెస్ మీట్లు ఉండవని, రద్దు చేసేస్తారని ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.